శంకరవరప్రసాద్ సెన్సార్ రివ్యూ.. అంతా ఓకే గానీ..

Edited By:

Updated on: Jan 08, 2026 | 6:08 PM

మన శంకవరవరప్రసాద్ గారు సినిమా సెన్సార్ పూర్తైంది. చిరంజీవి పాత జోష్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సంక్రాంతికి మెగాస్టార్ ప్రేక్షకులను రఫ్ ఆడించబోతున్నారని సెన్సార్ టాక్. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ అంశాలతో ఫస్ట్ నుంచి చివరి వరకు నవ్వులు పూయించే ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు పండగ ట్రీట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

సంక్రాంతికి పండగ సినిమా అంటూ ముందు నుంచి స్పెషల్ హైప్ క్రియేట్ చేసుకున్న మన శంకవరవరప్రసాద్ గారు సినిమా సెన్సార్ పూర్తైంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు.. వింటేజ్ చిరుని ప్రజెంట్ చేస్తూ అనిల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా వచ్చింది..? సెన్సార్ నుంచి వచ్చిన టాక్ ఏంటి..? పండక్కి మెగాస్టార్ రఫ్ ఆడించబోతున్నారా..? ఈసారి పండక్కి ఎన్ని సినిమాలు వస్తున్నా.. చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారుపై ఫ్యామిలీ ఆడియన్స్‌కు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. దానికి చిరు ఎంత కారణమో.. అనిల్ రావిపూడి కూడా అంతే. పండక్కి ఆయన సినిమా వచ్చిందంటే చాలు.. కుటుంబాలు క్యూ కడుతుంటాయి. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నాలుగోసారి పండక్కి వస్తున్నారు అనిల్. తాజాగా మన శంకవరవరప్రసాద్ గారు సెన్సార్ పూర్తైంది. అక్కడ్నుంచి వచ్చిన టాక్ చూస్తుంటే ఈసారి మెగాస్టార్ అభిమానులకు పండగ ముందే రావడం ఖాయమనిపిస్తుంది. ముందు నుంచి చెబుతున్నట్టే చిరంజీవిలోని ఆ పాత జోష్, ఆ వింటేజ్ మ్యాజిక్‍ను అద్భుతంగా అనిల్ రావిపూడి వెండితెరపై ఆవిష్కరించారని తెలుస్తుంది. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని.. మధ్యమధ్యలో వచ్చే చిరు పాపులర్ మేనరిజమ్స్, గ్రేస్ థియేటర్లో ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించడం ఖాయమని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. పైగా చిరు క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా ఉండబోతుంది. ట్రైలర్‌లో చూపించినట్లే యాక్షన్ మోడ్‌తో పాటు.. ఫ్యామిలీ మ్యాన్‌గానూ కనిపించబోతున్నారు మెగాస్టార్. ఫస్టాఫ్ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్‍తో పాటు నయన్‌తో ఫ్యామిలీ ట్రాక్ ఉంటుందని.. సెకండాఫ్‌లో ఓ స్పెషల్ మిషన్ కోసం చిరు రంగంలోకి దిగడంతో కథలో వేగం పెరుగుతుందని తెలుస్తుంది. చివరి 20 మినిట్స్ వెంకీతో కలిసి స్క్రీన్ షేక్ చేయబోతున్నారు చిరు. రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య తర్వాత చిరు నుంచి రానున్న మూడో సంక్రాంతి సినిమా ఇది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: జక్కన్న ఝలక్.. వారణాసి రిలీజ్ డేట్ లాక్

పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా

లేచింది మహిళా లోకం.. ఆ సినిమాలో ఐదుగురు స్టార్ హీరోయిన్లు

మేమే హీరోయిన్స్.. మేమే స్పెషల్ గాళ్స్.. కొత్త ట్రెండ్

పాన్ ఇండియా ట్రెండ్‌కు దూరమవుతున్న బాలీవుడ్‌