Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్

Edited By:

Updated on: Mar 20, 2026 | 8:00 PM

మధుబాల బయోపిక్ క్యాస్టింగ్ విషయంలో జాప్యం కొనసాగుతోంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్ వంటి పేర్లు వినిపించాయి. తాజాగా, సాయిపల్లవి పేరు ప్రముఖంగా చర్చల్లో ఉంది. తన బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా సాయిపల్లవి ఈ కీలక పాత్రను పోషిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ ప్రాజెక్ట్ కి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

భారీ భారీ విషయాలు సింపుల్‌ గా అయిపోవు. చాలా సమయం తీసుకుంటాయి. బాలీవుడ్‌ గ్రేట్‌ మధుబాల బయోపిక్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. టైటిల్‌ రోల్‌ లో నటిస్తారంటూ చాలా పేర్లే వినిపించాయి. ఇప్పుడు ఆ లిస్టులో సరికొత్త పేరు ఫ్లాష్‌ అవుతోంది. ఇంతకీ ఈ పేరైనా ఫైనల్‌ అవుతుందా? బాలీవుడ్‌లో ది గ్రేట్‌ మధుబాల బయోపిక్‌ స్క్రీన్‌ మీదకు రానుంది. సంజయ్‌ లీలా భన్సాలీ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేశారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మరోవైపు జరుగుతున్నాయి. కానీ, టైటిల్‌ పాత్రలో నటించేదెవరు? అనే సస్పె్న్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ లిస్టులో ఫస్ట్ వినిపించిన పేరు కియారా అద్వానీ. గేమ్‌ చేంజర్‌ తర్వాత టాక్సిక్‌ చేసి డెలివరీకి వెళ్లారు కియా అద్వానీ. తిరిగి రాగానే కచ్చితంగా మధుబాల బయోపిక్‌ టేకప్‌ చేస్తారనే భావించారు జనాలు. కానీ అది జరగలేదు. దాంతో శ్రద్ధాకపూర్‌ పేరు స్క్రీన్‌ మీదకు వచ్చింది.ఆల్రెడీ మరాఠా లేడీ బయోపిక్‌ తో బిజీగా ఉన్న శ్రద్ధ.. సారీ చెప్పినట్టు వార్తలొచ్చాయి. సైయ్యార ేమ్‌ అనితా పడ్డా పేరును కూడా పరిశీలించారట సంజయ్‌ లీలా భన్సాలీ. కానీ, ఈ సారి ఆయనే మనసు మార్చుకున్నట్టు టాక్‌. ఇటీవల సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ చూశాక… భన్సాలీ ఆమెతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. సో, నార్త్ కథనం ప్రకారం సాయిపల్లవి… మధుబాల రోల్‌ లో కనిపిస్తారు. ఇప్పుడు నార్త్ లో ఒకటికి మూడు ప్రాజెక్టులున్నాయి పల్లవి చేతిలో. సౌత్‌ లోనూ ప్రామినెంట్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటిస్తారనే టాక్‌ కూడా ఉంది. ఇన్నిటిని బ్యాలన్స్ చేసుకుంటూ ది బెర్ట్ పెర్ఫార్మర్‌ గ ముందుకు సాగుతున్నారు పల్లవి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి

రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..

మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!

నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!

Follow Us