Lokesh Kanagaraj: లోకేష్ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇంట్లో ఎన్నికల నిఘా బృందం తనిఖీలు నిర్వహించగా 10 AK-47 డమ్మీ గన్స్ లభించాయి. తొలుత సంచలనం సృష్టించిన ఈ ఘటన, చివరకు అల్లు అర్జున్ సినిమా షూటింగ్ కోసం సిద్ధం చేసిన ప్రాప్స్ అని తేలింది. పత్రాలు చూపించాక, పోలీసులు వాటిని తిరిగి అప్పగించారు. ఈ సంఘటన తమిళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ డిస్కషన్ టాపిక్ గా మారారు. నార్మల్ గా ఓ పోలీసు చేసిన తనిఖీ, తక్షణమే సంచలనంగా మారి, తర్వాత ఆసక్తికరమైన మలుపు తీసుకోవడం సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై కొత్త అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నివాసంపై ఎన్నికల నిఘా బృందాలు రైడ్ నిర్వహించాయి. చెన్నై ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన రొటీన్ చెక్‌లో10 AK-47 రైఫిళ్లు సీజ్ చేయడం మొదట పెద్ద షాక్‌ను కలిగించింది. దీంతో ఆ ఆయుధాలు నిజమైనవేనా? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ సోదాల్లో పది ఏకే 47లు లభ్యం కావడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ తమిళనాడులోని అశోక్ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోమవారం సోదాలు చేపట్టాయి. ఆ గన్స్ లోకేష్ కనగరాజ్‌కు చెందినవిగా తేలడంతో తమిళ సినీ వర్గాల్లో కలకలాన్ని రేపింది. ఆఏకే 47 గన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివరకు అవి నిజమైన తుపాలకు కావని పోలీసుల విచారణలో తేలింది. నిజమైన వాటిని పోలీనట్లుగా తయారు చేయించిన డమ్మీగన్స్. సినిమా షూటింగ్ కోసమే వాటిని లోకేష్ కనగరాజ్ ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. అందుకు సంబంధించిన పత్రాలను పోలీసులకు లోకేష్ కనగరాజ్ టీమ్ సమర్పించారరు. దాంతో ఆ గన్స్‌ను తిరిగి లోకేష్ కనగరాజ్ బృందానికి పోలీసులు అప్పగించారట. రజనీకాంత్ కూలీ తర్వాత తన నెక్స్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌తో చేయబోతున్నారు లోకేష్ కనగరాజ్. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. జూలై లేదా ఆగస్ట్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఆ మూవీ నుంచి ఏప్రిల్ 8న ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ వీడియో షూట్ కోసమే ఏకే 47 డమ్మీ గన్స్‌ను లోకేష్ కనగరాజ్ తయారు చేయించినట్లు వార్తలొస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఏడో సినిమా ఇది. ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాదే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు లోకేష్ కనగరాజ్. డీసీ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఆ తమిళ మూవీలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వేసవిలోనే రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
