Kriti Sanon: సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేసిన కృతి సనన్
సౌత్ సినిమాతో అడుగుపెట్టి బాలీవుడ్‌లో దూసుకుపోతున్న కృతి సనన్, తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. బాక్సాఫీస్ నంబర్లను పట్టించుకోకుండా కష్టపడి పని చేయడమే తన సక్సెస్ ఫార్ములా అన్నారు. ప్రతీ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం సాధ్యం కాదని, నిజాయితీగా పని చేస్తే విజయం దానంతట అదే వస్తుందని ఆమె పేర్కొన్నారు.
సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ కూడా ఆమె పేరు వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన కెరీర్ విజయానికి గల కారణాలను కృతి వెల్లడించారు. వన్ నేనొక్కడినే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కృతి, తెలుగులో ఆశించిన విజయం సాధించకపోయినా, ఉత్తరాదిలో మాత్రం తనదైన ముద్ర వేశారు. కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులతోనూ సత్తా చాటుతున్నారు. గ్లామరస్ రోల్స్‌తో పాటు ట్రెడిషనల్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్న కృతి, తన 20వ సినిమా కాక్టెయిల్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kamal Haasan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కమల్ హాసన్
Naga Chaitanya: 2026 గుర్తు పెట్టుకోండి.. నాదే అంటున్న నాగ చైతన్య
Ram Charan: ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న రామ్ చరణ్
స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తున్న 30 ప్లస్ బ్యూటీస్
Sandeep Vanga: స్పిరిట్ అప్‌డేట్.. వంగా దెబ్బకు ఫ్యూజులు ఔట్
