Krithi Shetty: అప్పుడు చలించకుండా.. ఇప్పుడు అందాలు ఆరబోసి ఏం లాభం?

Updated on: Aug 10, 2025 | 4:30 PM

దేనికైనా ఓ పద్దతి ఉంటుంది. ఓ ప్రొసీజర్ ఉంటుంది. అలా పద్దతి ప్రకారమే హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ లు.. ఫోటో షూట్‌లు చేస్తుంటారు. తమ ఫ్లెక్సిబులిటీని చూపిస్తూ.. తమ అందచందాలను ప్రదర్శిస్తూ.. ఆ ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతుంటారు. మేకర్స్‌ కు గాలం వేస్తుంటారు. అయితే లేట్‌గా అయినా.. తాజాగా కృతి శెట్టి ఇదే చేశారు. కానీ విచిత్రంగా విమర్శల పాలవుతున్నారు.

ఉప్పెన సినిమాతో మెగాస్టార్ మనసు దోచిన ఈ బ్యూటీ.. చిరు ఆన్‌ స్టేజ్‌ చెప్పినట్టు.. ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి ఎక్కడికీ పోకుండా సినిమా అవకాశాలే లేకుండా.. మిగిలిపోయారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతూ.. మేకర్స్ వైపు అవకాశం కోసం ఆశగా చూసే వరకు పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి ఈ సిట్యువేషన్‌లో.. కృతి శెట్టి ఓ ఫోటో షూట్‌తో కాస్త బోల్డ్‌ గా కనిపించారు. తాను హద్దులు దాటేందుకు రెడీ అన్నట్టుగా మేకర్స్ కు హింట్ ఇచ్చారు. ఆ ఫోటోలతో నెట్టింట కూడా తెగ వైరల్ అవుతున్నారు. కానీ అవే ఫోటోలతో మేకర్స్ మైండ్‌లో రిజిస్టర్ అయ్యారా? లేదా అనేది ఇక్కడ పాయింట్. పాన్ ఇండియా సినిమాలు.. మార్కెట్ అంచనాలు.. ప్రేక్షకుల నాడీని పట్టుకోడాలు.. ఓ సినిమా తెరకెక్కించేందుకు.. ఆ సినిమాలో ఆర్టిస్టులను క్యాస్ట్ చేసేందుకు… ఇలాంటి అంశాలనుపట్టుకునే మేకర్స్ ఇప్పుడు ఈమె బోల్డ్ ఫోటోలను చూసి ఛాన్స్ ఇస్తారా? లేక టూ లేట్ అంటూ.. లైట్‌ తీసుకుంటారా? అనేది ఇక్కడ పాయింట్. అయితే మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూను పక్కుక పెడితే.. ఇప్పుడు అందాలు ఆరబోసి ఏం లాభం అనేది నెటిజన్స్ కామెంట్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ కుటుంబాన్నిరోడ్డున పడేసిన పాము.. ఏం జరిగిందో తెలిస్తే

పెట్రోలు బంకు కొంప ముంచిన హెల్మెట్‌ రూల్

జేమ్స్ కామెరూన్ కొత్త సినిమా.. టైటానిక్ తరహాలో మరో రియల్ స్టోరీ

ఏడేళ్లలో 42 సార్లు ‘నో’ చెప్పింది 43వ సారి మాత్రం..

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. పొగతో నిండిపోయిన క్యాబిన్.. చివరకు..