నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?
ప్రస్తుతం తన 100వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున, తన తదుపరి, అంటే 101వ సినిమాపై చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో బంగార్రాజు సీక్వెల్ చేసే అవకాశం తొలుత ఉన్నా, అది వర్కౌట్ కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో, 101వ సినిమాకు దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం తన 100వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున, తన తదుపరి, అంటే 101వ సినిమాపై చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో బంగార్రాజు సీక్వెల్ చేసే అవకాశం తొలుత ఉన్నా, అది వర్కౌట్ కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో, 101వ సినిమాకు దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.నాగార్జున ఎప్పుడూ కథకు ప్రాధాన్యత ఇస్తారు. దర్శకుల ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా మంచి కథ నచ్చితే సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటారు. తన 100వ సినిమా బాధ్యతలను కూడా రా కార్తీక్ వంటి కొత్త దర్శకుడికి అప్పగించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో, బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ నచ్చితే ఆయనతో సినిమా చేసేందుకు నాగార్జున ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జాక్ సినిమాతో భాస్కర్ నిరాశపరిచినా, మూడు సంవత్సరాల క్రితం అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి విజయాన్ని అందించారు. అప్పటి నుండి అక్కినేని కాంపౌండ్ తో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఊహాగానంగా ఉన్నా, త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
