AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీఎఫ్ 2 రికార్డులను తిరగరాసిన కాంతార

కేజీఎఫ్ 2 రికార్డులను తిరగరాసిన కాంతార

Phani CH
|

Updated on: Oct 18, 2025 | 9:20 PM

Share

కాంతార: చాప్టర్ 1 కన్నడ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డులను బద్దలు కొట్టిన కాంతార తొలి భాగాన్ని కూడా ఈ కొత్త చిత్రం అధిగమించింది. కర్ణాటకలో 180 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో 650 కోట్లకు చేరుకొని రిషబ్ శెట్టి తన రికార్డులను తానే తిరగరాశారు.

ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అంచనాలను అందుకునే సినిమాలు భారీ విజయాలు సాధిస్తున్నాయి. కన్నడ చిత్రసీమలో అలాంటి అద్భుతాన్ని కాంతార: చాప్టర్ 1 సృష్టించింది. కేజీఎఫ్ సిరీస్ కన్నడ మార్కెట్ పరిధిని విస్తరించింది. కేజీఎఫ్ చాప్టర్ 2 ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, కేజీఎఫ్ చాప్టర్ 2 కర్ణాటకలో సాధించిన దాదాపు 160 కోట్ల రికార్డును అంతకు ముందు విడుదలైన కాంతార చిత్రం 175 కోట్లతో బద్దలు కొట్టింది. ఇప్పుడు, తాజాగా విడుదలైన కాంతార: చాప్టర్ 1, అక్టోబర్ 2న విడుదలై, కన్నడ చిత్రసీమలో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??

అత్తామామలను రెండు పీకి.. కట్‌ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే

త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం

ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..

తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??