రజనీ ఫ్యాన్స్‌ను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న ధనుష్‌.. ‘ఓం’ రిలీజ్‌పై ట్విస్ట్‌

Edited By:

Updated on: Sep 15, 2026 | 9:31 PM

కోలీవుడ్‌లో దసరా బాక్సాఫీస్‌ క్లాష్‌పై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ అక్టోబర్‌ 15న, ధనుష్‌, మమ్ముట్టి నటిస్తున్న ‘ఓం’ అక్టోబర్‌ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే రజనీతో నేరుగా పోటీ వద్దని ధనుష్‌ రిలీజ్‌ డేట్‌ మార్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ థియేట్రికల్‌, ఓటీటీ ఒప్పందాల కారణంగా డేట్‌ మార్చడం అంత సులభం కాదు. చర్చలు సక్సెస్‌ అయితే ‘ఓం’ దీపావళికి వెళ్లే అవకాశం ఉంది.

దసరా బరిలో కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర బిగ్‌ క్లాష్‌ గ్యారెంటీ అన్న టాక్ వినిపించింది. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తే ఆ పరిస్థితి లేదన్న టాకే వినిపిస్తోంది. ఓ సీనియర్ హీరోతో మరో స్టార్ హీరో క్లాస్‌కు కాలు దువ్వటంతో చెన్నీ సర్కిల్స్‌లో హీట్ పెరింగింది. కానీ ఫైనల్‌గా ఈ ఫైట్‌ విషయంలో ఓ హీరో వెనక్కి తగ్గారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే ధనుష్, మమ్ముట్టి లీడ్ రోల్స్‌లో రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ‘ఓం’ సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. ఇద్దరు హీరోలు క్లాష్ విషయంలో పట్టు వీడట్లేదన్న టాక్ వినిపించింది. కానీ సడన్‌గా ధనుష్‌ మనుసు మార్చుకున్నారన్న న్యూస్‌ తెర మీదకు వచ్చింది. రజనీతో క్లాష్‌ వద్దని ఫీల్ అవుతున్నారట ఈ స్టార్ హీరో. అయితే రిలీజ్ డేట్ మార్చడం ధనుష్‌కు అంత ఈజీ వ్యవహారంగా కనిపించడం లేదు. ‘ఓం’ థియేట్రికల్, ఓటీటీ హక్కులను అక్టోబర్ 16 రిలీజ్ ప్రకారమే అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు డేట్ మారిస్తే స్ట్రీమింగ్ గ్యాప్‌ను కూడా మార్చాల్సి వస్తుంది. ఈ విషయం మీద ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతోంది ధనుష్ టీమ్‌. చర్చలు సక్సెస్ అయితే ‘ఓం’ సినిమా అక్టోబర్ నుంచి తప్పుకుని దీపావళి బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఓటీటీ డీల్ అడ్జస్ట్ కాకపోతే మాత్రం, రజనీకాంత్‌, ధనుష్ మధ్య బాక్సాఫీస్ క్లాష్ తప్పదు. ఇద్దరూ భారీ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్స్ కావడంతో, ఒకవేళ ఈ ఫైట్ జరిగితే ఆ రచ్చ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో మైథలాజికల్‌ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్‌ హీరోలు!

గ్లామర్‌ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్‌ హీరోయిన్ల కొత్త రూట్‌!

Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్‌ ధర ఎంతంటే!

పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?

USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్‌ నిర్ణయానికి కోర్టు బ్రేక్‌

Loading...
Unable to load recommendations.
Follow Us