Toxic: టాక్సిక్ కోసం యశ్ ప్లాన్.. ఫ్యాన్స్ షాక్..!

Edited By:

Updated on: Jun 01, 2026 | 2:15 PM

కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తున్న టాక్సిక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వరుస వాయిదాలు, విడుదల తేదీలపై స్పష్టత లేకపోవడం అభిమానుల్లో అసంతృప్తి పెంచుతోంది. ఓటీటీ ఒప్పందాలు, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ వ్యూహాల కారణంగానే ఆలస్యం జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో రామాయణ ప్రాజెక్ట్‌తోనూ బిజీగా ఉన్న యశ్, టాక్సిక్ విడుదలపై ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

ఆలస్యం అమృతం విషం అంటారు కదా.. ఇప్పుడు టాక్సిక్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. అయినా రేస్ ఎలా మొదలుపెట్టామనేది కాదు ఎప్పుడు ముగించాలనేది తెలియాలి. ఈ విషయంలో టాక్సిక్ వెనకబడిందా.. క్లారిటీ నుంచి కన్ఫ్యూజన్ వైపు యశ్ అడుగులు పడుతున్నాయా..? టీమ్ చేస్తున్న లేట్ కారణంగా సినిమాపై ప్రభావం పడుతుందా..? కారణాలెన్ని చెప్పినా.. సంజాయిషీలెన్ని ఇచ్చినా యశ్ చేస్తున్న పని ఫ్యాన్స్‌కు ససేమిరా నచ్చట్లేదు. 1000 కోట్ల సినిమా ఇచ్చాక.. నాలుగేళ్లకు పైగా స్క్రీన్ మీద కనిపించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్లు. టాక్సిక్ మార్చి 19న వస్తుందని వాయిదా వేసారు.. జూన్ 4 అని చెప్పి మరోసారి నిరాశ పరిచారు. చూస్తుంటే 2026లో టాక్సిక్ రావడం కష్టమే అనిపిస్తుంది. షూటింగ్ పూర్తైన సినిమాను ఎందుకు విడుదల చేయట్లేదనే సస్పెన్స్ అభిమానులను వెంటాడుతుంది. అడిగితే హాలీవుడ్ ప్లాన్ ఇది.. ముందు బిజినెస్ అవ్వాలి.. తర్వాత ప్రమోషన్ చేయాలి.. ఆపైనే థియెట్రికల్ రిలీజ్ అని సర్ది చెప్తున్నారు రాకింగ్ స్టార్. కానీ టాక్సిక్ వాయిదా వెనక మరో మేజర్ రీజన్ కూడా కనిపిస్తుంది.. అదే ఓటిటి డీల్ పూర్తవ్వకపోవడం..! టాక్సిక్ లాంటి పెద్ద సినిమాకు నాన్ థియెట్రికల్ అత్యంత కీలకం. అందుకే ఓటిటితో పాటు హాలీవుడ్ కంపెనీల చేతుల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ వర్కవుట్ అయితే కానీ టాక్సిక్ రాదేమో..? మరోవైపు రామాయణతోనూ బిజీగా ఉన్నారు యశ్. మొత్తానికి ఈ హీరోను చూస్తుంటే మితిమీరిన క్లారిటీతో కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి

ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!

అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’

Follow Us