మళ్ళీ వస్తున్న ఇండియన్.. శంకర్‌కు అదే టెన్షన్..!
భారీ అంచనాల మధ్య వస్తున్న ఇండియన్ 3 షూటింగ్ విషయంలో దర్శకుడు శంకర్‌కు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఊహించని షాక్ ఇచ్చింది. అదనపు ఫుటేజ్ కోసం శంకర్ కోరిన 25 రోజుల షూటింగ్‌కు లైకా నో చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఫుటేజ్‌తోనే ఫైనల్ కట్‌ను రెడీ చేయాలని తేల్చి చెప్పింది.
కమల్ హాసన్ హీరోగా, దర్శకుడు శంకర్ రూపొందించిన ఇండియన్ 2 చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో, రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మేకర్స్ ఇండియన్ 3 ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి దర్శకుడు శంకర్‌కు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇండియన్ 3 కోసం అదనపు ఫుటేజ్ చిత్రీకరించడానికి మరో 25 రోజుల పాటు షూటింగ్ చేయాలని దర్శకుడు శంకర్ భావించారు. అయితే, శంకర్ పెట్టిన ఈ ప్రతిపాదనకు లైకా ప్రొడక్షన్స్ నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడవ భాగానికి మళ్లీ కొత్తగా పెట్టుబడి పెట్టడం కంటే, ఇప్పటికే షూట్ చేసిన ఫుటేజ్‌తోనే ఫైనల్ కట్‌ను సిద్ధం చేయాలని లైకా సంస్థ శంకర్‌కు స్పష్టం చేసిందట. ప్రస్తుతం ఉన్న ఫుటేజ్ సినిమాకు సరిపోతుందని భావిస్తున్న మేకర్స్, కేవలం VFX, పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే దృష్టి సారించారు. కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతికి ఇండియన్ 3ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్న ‘రామాయణ’ టీమ్
సౌత్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హృతిక్ రోషన్
