Krrish 4: క్రిష్‌ మూవీలో జాకీచాన్‌.. డీల్‌ ఓకేనా

Edited By: Phani CH

Updated on: Oct 30, 2025 | 2:01 PM

ఒక సినిమా ఆడితే పొంగిపోయి, ఇంకో సినిమా ఆడకపోతే కుంగిపోతే ఫస్ట్ హీరోకి చెల్లుతుందేమోగానీ, ఆల్రెడీ సూపర్‌ స్టార్‌ హోదాలో ఉన్నవారికి ఎలా చెల్లుతుంది? ఒక్కసారి ఇంజిన్‌ స్టార్ట్ చేస్తే పులి మీద స్వారీనే.. కాసేపు దిగడాలు.. సేదదీరడాలు ఉండవు. హృతిక్‌ పరంగానూ ఇదే టాపిక్‌ డిస్కషన్‌లో ఉందిప్పుడు. హృతిక్‌రోషన్‌ నుంచి వి వాంట్‌ మోర్‌ అనే మాటను పదే పదే వాడుతున్నారు ఫ్యాన్స్.

ఆయన ఎన్నెన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న ఫైటర్‌ లాస్ట్ ఇయర్‌ భారీ బ్లాక్‌ బస్టర్‌ లిస్టులో చేరలేకపోయింది. ఈ ఏడాది వార్‌2 కూడా అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. సో.. సాలిడ్‌ హిట్‌ చూసి చాన్నాళ్లైంది హృతిక్‌. అందరూ వెయ్యి కోట్ల మార్క్ ని టచ్‌ చేస్తుంటే.. బంపర్‌ హిట్లున్నా.. ఆ రికార్డు మాత్రం కొట్టలేకపోయారు సిల్వర్‌ స్క్రీన్‌ గ్రీక్‌ గాడ్‌. అందుకే నెక్స్ట్ ప్లానింగ్‌ మాత్రం సాలిడ్‌గా ఉండాలనే సలహాలు వినిపిస్తున్నాయి. ఇక థింక్‌ లోకల్‌ అనే కాన్సెప్లే లేదు.. థింక్‌ గ్లోబల్‌ అండ్‌ యాక్ట్ గ్లోబల్‌ అని ఫిక్సయినట్టున్నారు హృతిక్‌. క్రిష్‌ 4 కోసం ఏకంగా జాకీ చాన్‌తో ములాఖత్‌ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా జాకీజాన్‌ని కలిసి తీసుకున్న పిక్‌ షేర్‌ చేయడంతో ఈ టాక్‌ షురూ అయింది ఇండస్ట్రీలో. ఓ వైపు యాక్టింగ్‌, ఇంకో వైపు నటన.. డ్యూయల్‌ రోల్ ప్లే చేయబోతున్నారు హృతిక్‌. రీసెంట్‌గా కాంతారలో రిషబ్‌ కూడా అదే చేశారని, హృతిక్‌ అంతకు మించి సక్సెస్‌ కావాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇంటర్నేషనల్‌ లెవల్లో ప్రతిదీ ఉండేలా జాగ్రత్తగా డీల్‌ చేస్తున్నారు హృతిక్‌. ఈ సారి మాత్రం వెయ్యి కోట్ల మార్క్ టచ్‌ చేసి తీరాల్సిందేననే సంకల్పం కనిపిస్తోంది ఆయనలో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా

నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే

ఫిజికల్ అయిన పవన్‌, భరణి తీవ్ర గాయాలతో హౌస్‌ బయటకు భరణి..

ఆ డైరెక్టర్‌ పెళ్లికి అదిరిపోయే సర్‌‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

ఆమెకు నోటి దురుసు.. వీళ్లద్దరికీ ప్రేమ ముసుగు! ఈసారి దిమ్మతిరిగే ఎలిమినేషన్‌

Published on: Oct 30, 2025 01:50 PM