పాటలతో మారిపోతున్న సినిమాల జాతకాలు.. మ్యూజిక్‌తోనే మ్యాజిక్ చేస్తున్న మేకర్స్

Edited By:

Updated on: May 28, 2026 | 4:29 PM

చిన్న సినిమాలకు ఇప్పుడు పాటలే ప్రధాన బలంగా మారుతున్నాయి. ‘ఎపిక్’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘నాగబంధం’ వంటి చిత్రాల పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాలపై ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మంచి సంగీతమే ఇప్పుడు చిన్న సినిమాలకు భారీ ప్రచారంగా మారుతోంది.

ఒక్క పాటతో ఏమైపోతుంది.. సినిమా జాతకం ఏమైనా మారిపోతుందా అనుకోవచ్చు. కానీ ఏమో గుర్రం ఎగరావచ్చు.. పాటలతోనే మ్యాజిక్ జరగొచ్చు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు పాటలే ప్రాణంగా నిలుస్తున్నాయి. ఈ మధ్య సాంగ్స్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. వాళ్ళ కష్టం ఫలించి పాటలతో పాపులర్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా..? బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య sహాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్ సినిమాలో పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఆల్రెడీ గోరేటి వెంకన్నతో రాయించిన సంచారమే సాంగ్ బాగా ట్రెండ్ అయింది. తాజాగా ప్రియసఖి అంటూ మరో బ్యూటీఫుల్ సాంగ్‌ను తీసుకొచ్చారు మేకర్స్. ఆనంద్, వైష్ణవి కెమిస్ట్రీ ఈ పాటకు మెయిన్ అట్రాక్షన్‌గా నిలిచింది. కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి తెరకెక్కిస్తున్న చెన్నై లవ్ స్టోరీ సినిమాలో పాటలకే పెద్ద పీట వేస్తున్నారు నిర్మాత సాయి రాజేష్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆయనే అందిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గుర్తుందా పాట బాగా పాపులర్ అయింది.. తాజాగా ‘వదలనే’ అనే మరో క్యూట్ సాంగ్ వదిలారు దర్శక నిర్మాతలు. చెన్నై లవ్ స్టోరీ పూర్తిగా మ్యూజికల్ సినిమాగానే రాబోతుంది.. ఏడుకు ఏడు పాటలు మెలోడీస్‌ ఉండబోతున్నాయి. ఇక నాగబంధం సినిమాలోని పాటలు కూడా బాగానే పాపులర్ అయ్యాయి. నమో నమోతో పాటు సుర సుర అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కేవలం పాటలతోనే సింగ్ గీతం అనే సినిమా చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో

ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. చిన్న వయసులోనే బీపీ ముప్పు

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

Follow Us