తల్లి చివరి కోరిక కోసం..యాక్టింగ్ మానేసి డాక్టర్‌గా..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన భరత్, ఇప్పుడు వైద్యుడిగా మారాడు. తన తల్లి కమలాసిని చివరి కోరికను నెరవేర్చడానికి నటనను పక్కనపెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్నో హిట్ చిత్రాలతో పేరు పొందిన భరత్, తల్లి మరణానంతరం ఆమె ఆశయాన్ని నిజం చేశాడు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సుమారు 80కి పైగా సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన భరత్ ఇప్పుడు వైద్యుడిగా మారాడు. రెడీ, వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, పోకిరి వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశాడు. చిన్నతనంలోనే బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి వంటి స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న భరత్, తన నటనకు గుర్తింపుగా రెండు నంది అవార్డులు కూడా అందుకున్నాడు.చైల్డ్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటిన భరత్, యువ హీరో అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాలో సెకండ్ హీరోగానూ మెరిశాడు. అయితే, కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న భరత్ వ్యక్తిగత జీవితంలో గతేడాది విషాదం చోటు చేసుకుంది. 2025 మే 19న ఆయన మాతృమూర్తి కమలాసిని గుండెపోటుతో కన్నుమూశారు. తన తల్లి కమలాసిని కోరిక మేరకు భరత్ డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచీ ఆశించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
