సిల్వర్ స్క్రీన్ మీద సారా అర్జున్ నయా సెన్సెషన్
దురంగా 2 సక్సెస్ తో ఆ సినిమా హీరో, దర్శకుడు మాత్రమే కాదు హీరోయిన్ సారా అర్జున్ కూడా నేషనల్ సెన్సేషన్ గా మారారు. హీరోయిన్ గా నటించిన తొలి సినిమానే ఈ రేంజ్ లో సక్సెస్ కావటంతో సారా పేరు టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆమె కెరీర్ గురించి బాలీవుడ్ తో పాటు సౌత్ సర్కిల్స్ లోనూ డిస్కషన్ జరుగుతోంది.
దురంగా సిరీస్ లో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. తొలి భాగంలో అల్లరి పిల్లగా కనిపించిన సారా సీక్వెల్ లో ఓ బిడ్డకి తల్లిగా నటించి మెప్పించారు. 20 ఏళ్ల వయసులోనే తల్లి పాత్రలో నటించి ఇండస్ట్రీ జనాలకి షాక్ ఇచ్చారు. దాదాపు 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సారా అర్జున్ నాన్న సినిమాతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో నటించి మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూనే పొన్నియన్ సెల్వన్ సినిమాతో సడన్ గా రొమాంటిక్ టర్న్ తీసుకున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య చిన్ననాటి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. పొన్నియన్ సెల్వన్ లో సారా నటన నచ్చి దురంగా సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు దర్శకుడు ఆదిత్య ధర్. రణ్వీర్ కి సారా కి మధ్య వయసు తేడా చాలా ఉన్నా, కథ పరంగా అలాంటి తేడా ఉంటేనే కరెక్ట్ అన్న ఉద్దేశంతో ఆమెని సెలెక్ట్ చేసుకున్నారు. దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని వందకి వంద శాతం నిలబెట్టుకున్నారు సారా అర్జున్. ఓ వైపు దురంగా లాంటి రా యాక్షన్ మూవీలో నటిస్తూనే మరో వైపు తెలుగులో యూఫోరియా అనే రియలిస్టిక్ మూవీలో నటించారు. ఈ రెండు సినిమాల్లోనూ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సారా అర్జున్, ఫిలిం సర్కిల్స్ లో నయా సెన్సేషన్ గా మారారు.
మరిన్ని వీడియోల కోసం :
