Loading video

Puri Jagannadh: వావ్‌! పూరీకి హీరో దొరికేశాడోచ్‌

|

Mar 20, 2025 | 6:46 PM

ప్రస్తుతం పూరిజగన్నాథ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు.

యూత్‌ను ఆకట్టుకునే కథలు..డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. అయితే పూరి నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేస్తారు అన్నది మాత్రం సాస్పెన్స్ గానే ఉంది. ఆ మధ్య అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో పూరి సినిమా ఉంటుందని టాక్ వినిపించింది. అలాగే తమిళ్ హీరో సినిమా చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఎస్ ! పూరిజగన్నాథ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజా సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అలాగే విడుదల 2లోనూ నటించి మెప్పించారు. ఇప్పుడు పూరి డైరెక్షన్ లో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఇటీవలే విజయ్‌కి పూరి కథ వినిపించినట్టు తెలుస్తోంది. కథా చర్చలు కొలిక్కి వచ్చినట్టే అని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడంపై క్లారిటీ రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెట్టింగ్ యాప్ కేసులో ED ఎంట్రీ! తీవ్ర చిక్కుల్లో ఆ 11 మంది

Tasty Teja: పోలీసులకు షాకిచ్చిన టేస్టీ తేజ

Nayanthara: దారుణంగా తిట్టి అవమానించాడు…స్టార్ డైరెక్టర్‌ పై నయన్ తీవ్ర ఆరోపణలు

డ్రగ్స్‌తో అప్రతిష్ట! షాకింగ్ నిర్ణయం తీసుకున్న హేమ

ఇక ఆధార్, మొబైల్‌తో ఓటర్ఐడీ లింక్ తప్పనిసరి