తగ్గేదేలేదు.. డిజిటల్‌లోనూ మెగా జోష్‌ ..

Updated on: Feb 15, 2026 | 12:57 PM

సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ దూసుకుపోతోంది. ఓటీటీ విడుదలైన 24 గంటల్లోనే 200 మిలియన్ నిమిషాలకు పైగా స్ట్రీమ్ అయిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించి, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

సంక్రాంతి బరిలో విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో రికార్డుల వసూళ్లు సాధించి, రీజనల్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు డిజిటల్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకొని ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!