Chiranjeevi Leaked Video: ఓకే డీజే స్టార్ట్ సౌండ్..! ఇక పగిలిపోవాలి బ్యాండ్.! చిరు లీక్ చేసిన వీడియో వైరల్..
మెగా స్టార్ చిరూస్ మోస్ట్ అవేటెడ్ మూవీ నుంచి మరో దిమ్మతిరిగే అప్డేట్ బయటికి వచ్చేసింది. బాలయ్య బర్త్ డే ముందు రోజే... చిరు చేసిన ఓ తుంటరి పని కారణంగానే భోళాశంకర్ సాంగ్ షూట్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింటికి వచ్చేసింది. జెస్ట్ అలా వచ్చిందో లేదో.. ఇలా త్రూ అవుట్ సోషల్ మీడియా తెగ ట్రెండ్ అవుతోంది.
మెహర్ రమేష్ డైరెక్షన్లో.. చిరు 155th ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న సినిమానే భోళా శంకర్..! ఆగస్టు 11 న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా నుంచి తాజాగా ఓ లీక్ ఇస్తా అంటూ.. ఆడియో నోట్ ను రిలీజ్ చేశారు మెగాస్టార్. ఇక ఆడియోలో చెప్పినట్టే.. భోళా శంకర్ నుంచి.. ఓ సాంగ్ షూట్‌కు సబంధించిన ఓ వీడియోను లీక్ చేశారు. ఇక సాంగ్ షూట్‌కు సంబంధించినట్టుగా ఉన్న ఈ వీడియోలో.. మెగాస్టార్ చిరుతో పాటు.. మిల్కీ బ్యూటీ తమన్నా.. అక్కినేని సుశాంత్, కీర్తి సురేష్‌లు .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సరదాగా ఆడి పాడారు. అంతే కాదు.. ఇదే షూట్లో హైపర్ ఆదితో పాటు.. గెటప్ శ్రీను.. స్టార్ కమెడియన్ రఘు బాబులు కనిపించారు. అంతేకాదు వీడియో చివర్లో ‘ఓకే డీజే! స్టార్ట్ సౌండ్’ అంటూ చిరు డైలాగ్ చెప్పి… తన స్టైల్లో ఓ చిన్న స్టెప్ వేయడం.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో.. ఆ క్లిప్‌నే కట్ చేసి మరీ వైరల్ చేసేలా చేస్తోంది. దాంతో పాటే సినిమాపై అంచనాలను కూడా పెంచేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.