Hyderabad: అమిత్‌ షాతో.. మెగాస్టార్‌, రామ్‌చరణ్‌ భేటీ.. మహాపాదయాత్రకు ముందు ఆసక్తికర పరిణామం

Updated on: Nov 02, 2026 | 4:20 PM

హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మెగాస్టార్‌ చిరంజీవి, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భేటీ అయ్యారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో అమిత్‌ షా వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కలయిక మర్యాదపూర్వకమైనదేనని వర్గాలు చెబుతున్నప్పటికీ, బీజేపీ మహాపాదయాత్ర ప్రారంభానికి కొన్ని గంటల ముందే జరగడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పలువురు ప్రముఖులు వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా సినీ, రాజకీయ వర్గాల్లో అమితాసక్తిని రేకెత్తించే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయకు చేరుకుని కేంద్ర మంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హోటల్‌కు విచ్చేసిన చిరు, రామ్‌చరణ్‌ను అమిత్ షా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ఈ కలయిక కేవలం మర్యాదపూర్వకమైనదేనని వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ.. కేంద్ర హోంమంత్రితో టాలీవుడ్ అగ్ర హీరోలు సమావేశం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నగరంలో బీజేపీ మహాపాదయాత్ర ప్రారంభానికి సరిగ్గా కొద్ది గంటల ముందు జరిగిన ఈ భేటీ ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సినీ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us