16 ఏళ్లుగా ఆ విజయం కోసం హీరోయిన్ల వెయిటింగ్

Edited By:

Updated on: Jun 14, 2026 | 7:41 PM

అరుంధతి తర్వాత సౌత్‌లో అదే స్థాయి లేడీ ఓరియెంటెడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కోసం స్టార్ హీరోయిన్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. అనుష్క నుంచి సమంత వరకు పలువురు నటీమణులు యాక్షన్ ప్రధాన చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు సమంత, రష్మిక, నయనతార మరోసారి అదే లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అందనిద్రాక్ష కోసం మన హీరోయిన్లు పోరాడుతున్నారా..? గత 15 ఏళ్లుగా ఆ ప్రయత్నం చేస్తున్నా ఎవరికీ ఆ విషయంలో సక్సెస్ అందట్లేదా..? ఎన్ని సినిమాలు చేసినా ఫలితం మాత్రం అంతేనా..? తాజాగా సమంత కూడా ఇదే జోనర్‌తో రాబోతుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే స్టోరీలో చూసేద్దాం పదండి..! గ్లామర్ పండించే హీరోయిన్లు అప్పుడప్పుడూ యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొడుతుంటే స్క్రీన్ కళకళలాడుతుంది. మన ముద్దుగుమ్మలు కూడా అలాంటి మేకోవర్ కోసమే శక్తివంచన లేకుండా ట్రై చేస్తున్నారు.. కానీ ఏం చేస్తాం కాలమే కలిసిరావట్లేదు పాపం. అప్పుడెప్పుడో 2009లో వచ్చిన అరుంధతి తర్వాత.. సౌత్‌లో ఆ రేంజ్ లేడీ ఓరియెంటెడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ లేదు. అరుంధతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి డిమాండ్ బాగా పెరిగింది.. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇలాంటి యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ట్రై చేసారు. కానీ ఎవరికీ సక్సెస్ రాలేదు. ఎవరివరకో ఎందుకు అనుష్కకే ఆ రేంజ్ బొమ్మ పడలేదు. భాగమతి ఓకే అనిపించిందే కానీ అరుంధతిని మరిపించలేదు. కాజల్, నయనతార, తమన్నా, సమంత లాంటి బ్యూటీస్‌కు ఇదే జరిగింది. తాజాగా సమంత మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. మా ఇంటి బంగారంలో అదిరిపోయే యాక్షన్ పండిస్తున్నారు. ఈ సినిమాలో ఈమెకు బాషా రేంజ్ బ్యాక్‌డ్రాప్ ఉంటుందంటున్నారు నందిని రెడ్డి. అలాగే మైసాతో రష్మిక మందన్న.. రెక్కయ్‌తో నయనతార ఇలాంటి యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. మరి ఇన్నేళ్ల తర్వాతైనా జేజమ్మను మరిపించే హిట్ మన బ్యూటీస్ ఇస్తారా..? ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి రూటే సపరేట్.. అందులో మనోడికి తిరుగులేదు.. మామూలుగా సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ మొదలవుతుంటాయి. కానీ అనిల్ మాత్రం ముహూర్తానికి ముందు నుంచే ప్రమోషన్స్ మొదలు పెడుతుంటారు. తాజాగా వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమాకు కూడా ఇదే చేశారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈయన పేరు ప్రకటిస్తూ జంధ్యాల స్టైల్‌లో అదిరిపోయే వింటేజ్ వీడియోను విడుదల చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌కే టైం బాంబ్‌లా..రూ.1000 కోట్ల కల

Peddi: పెద్ది హిట్టా..? ఫట్టా..? ఫైనల్‌గా కలెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి?

పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ

ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

Follow Us