Brahmastra 2: బ్రహ్మాస్త్ర 2పై బిగ్ అప్‌డేట్.. రణ్‌బీర్ డబుల్ రోల్, దీపిక ఎంట్రీకి రంగం సిద్ధం

Edited By:

Updated on: Aug 22, 2026 | 7:41 PM

‘బ్రహ్మాస్త్ర’ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకొచ్చింది. ‘రామాయణ’ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత రణ్‌బీర్ కపూర్ 2027 ఏప్రిల్ నుంచి ‘బ్రహ్మాస్త్ర 2’ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈసారి శివ, దేవ్ పాత్రల్లో డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఆలియా భట్‌తో పాటు దేవ్ భార్య అమృత పాత్ర కోసం దీపికా పదుకొణెతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్రహ్మాస్త్ర సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ బయటికొచ్చింది. అస్త్రవర్స్ ఎక్స్‌ప్యాన్షన్‌తో పాటు క్యాస్టింగ్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ రణ్‌బీర్ లైనప్‌లో బ్రహ్మాస్త్ర షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? అయాన్ ముఖర్జీ నెక్ట్స్ స్టెప్పేంటి? బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివతో పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ చేసిన రణ్‌బీర్ కపూర్.. ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ రెండో భాగాన్ని కూడా 2027 జనవరి నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అది పూర్తయిన వెంటనే, ఏప్రిల్ నుంచి అఫీషియల్‌గా బ్రహ్మాస్త్ర 2 షూటింగ్‌ను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాకరు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో కేవలం శివగా మాత్రమే కనిపించిన రణ్‌బీర్.. సెకండ్ పార్ట్‌లో శివ, దేవ్ క్యారెక్టర్లలో డ్యూయల్ రోల్‌ చేస్తున్నారు. మొదటి పార్ట్‌లో హీరోయిన్‌గా నటించిన ఆలియా భట్ మరోసారి ఇషాగా మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు దేవ్ భార్య అమృత రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతో చర్చలు జరుపుతున్నారు మేకర్స్‌. దీపికా ఎంట్రీ కన్ఫర్మ్ అయితే సినిమా రేంజ్‌ మరింత పెరుగుతుందన్న నమ్మకంలో ఉంది యూనిట్‌. ఇండియన్ మైథాలజీకి మోడరన్ సినిమాటిక్ టచ్ ఇస్తూ దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సీక్వెల్‌ను మరింత భారీ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ లైనప్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా…అన్నింటినీ పక్కన పెట్టి, బ్రహ్మాస్త్రకే రణ్‌బీర్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారట. మరి ఫస్ట్ పార్ట్‌ విషయంలో ఫుల్ మార్క్స్ సాధించలేకపోయిన అయాన్ ముఖర్జీ.. సీక్వెల్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారు? ఈ అస్త్రవర్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

Loading...
Unable to load recommendations.
Follow Us