హిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్, సల్మాన్, షారూఖ్
ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసించిన సల్మాన్, షారూఖ్, ఆమిర్ ఖాన్‌ల హవా క్రమంగా తగ్గడంతో కొత్త తరం సూపర్‌స్టార్లపై చర్చ మొదలైంది. ప్రస్తుతం వరుస విజయాలతో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్ ముందంజలో కనిపిస్తున్నారు. రణబీర్ వరుస బ్లాక్‌బస్టర్లతో, విక్కీ కౌషల్ కంటెంట్ ఆధారిత విజయాలతో, రణవీర్ సింగ్ ‘ధురంధర్’తో భారీ వసూళ్లు సాధిస్తూ బాలీవుడ్‌కు కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నారు. వీరినే తదుపరి తరం సూపర్‌స్టార్లుగా భావిస్తున్నారు.
బాలీవుడ్‌లో ఖాన్ హవాకు ఆల్మోస్ట్ తెరపడింది. ఒకప్పుడు సూపర్‌స్టార్స్‌గా ఇండస్ట్రీని రూల్ చేసిన ఖాన్స్… ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో నయా సూపర్ స్టార్స్ ఎవరన్న విషయంలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ రేసులో ఉన్న హీరోలు ఎవరు..? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు బాలీవుడ్‌లొ ఖాన్స్ హవానే ఎక్కువగా కనిపించేది. సల్మాన్, షారూఖ్, ఆమిర్ ఖాన్ ఇండస్ట్రీ సేవియర్స్‌గా కనిపించేవారు. ఇండస్ట్రీ హిట్స్, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అన్నీ ఈ స్టార్స్ నుంచే వచ్చేవి. కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. ఖాన్స్ హవాకు తెరపడింది. అదే టైమ్‌లో బాలీవుడ్ జోరుకు బ్రేక్ పడింది. ప్రజెంట్ బాలీవుడ్ సినిమా మళ్లీ పుంజుకుంటోంది. వరుస హిట్స్‌తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో ఈ జనరేషన్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎవరన్న విషయంలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ప్రజెంట్ బాలీవుడ్ బాక్సాఫీన్‌ను షేక్ చేస్తున్న రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, విక్కీ కౌషల్ ఈ లిస్ట్‌లో అందరికంటే ముందు కనిపిస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ ఫేట్ మార్చిన రణబీర్, చిన్న సినిమాలతో మొదలు పెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన విక్కీ కౌషల్, ధురంధర్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసిన రణవీర్ సింగ్ బాలీవుడ్ సేవియర్స్‌గా కనిపిస్తున్నారు. అందుకే నెక్ట్స్ జనరేషన్ సూపర్ స్టార్స్ వీళ్లే అని ఫిక్స్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీమిండియాను కలవరపెడుతున్న వరుస గాయాలు.. రంగంలోకి బీసీసీఐ పెద్దలు!
వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు
సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!