టాలీవుడ్‌పైపు చూస్తున్న బాలీవుడ్ భామలు.. 2026లో హైదరాబాద్‌కే మకాం

Edited By:

Updated on: May 30, 2026 | 3:14 PM

2026లో టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్లకు ప్రధాన గమ్యస్థానంగా మారుతోంది. జాన్వీ కపూర్, దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రా, రషా తడాని, త్రిప్తి దిమ్రి వంటి ముంబై ముద్దుగుమ్మలు వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోల సరసన నటిస్తూ తమ కెరీర్‌ను తెలుగు ఇండస్ట్రీలో విస్తరించుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీల కొత్త కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.

పేరుకేమో వాళ్లు బాలీవుడ్ హీరోయిన్లు.. కానీ 2026లో వాళ్లు చేసే సినిమాలన్నీ తెలుగులోనే..! టాప్ బ్యూటీస్ నుంచి చిన్న హీరోయిన్ల వరకు ముంబై ముద్దుగుమ్మల కేరాఫ్ అడ్రస్ 2026లో హైదరాబాద్ కాబోతుంది. టాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ బిజీ కాబోతున్నారు ఆ ముద్దుగుమ్మలంతా. మరి హైదరాబాద్‌కు మకాం మారుస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు..? 2026లో బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది తెలుగులోనే కనిపించబోతున్నారు. అందులో ముఖ్యంగా జాన్వీ కపూర్ గురించి చెప్పుకోవాలి. ఆల్రెడీ పెద్దిలో చరణ్‌తో కలిసి నటిస్తున్న ఈ బ్యూటీ.. త్వరలోనే దేవర 2లోనూ భాగం కానున్నారు. అలాగే రవీన్ టాండన్ కూతురు రషా తడాని చూపులన్నీ తెలుగుపైనే ఉన్నాయి. శ్రీనివాస మంగాపురంతో ఎంట్రీ ఇస్తున్నారు ఈ వారసురాలు. దీపిక పదుకొనే కూడా బాలీవుడ్ కంటే టాలీవుడ్‌పైనే ఫోకస్ చేసారిప్పుడు. కల్కితో ప్రభాస్‌తో నటించిన దీపిక.. ప్రస్తుతం బన్నీతో రాకాలో భాగమయ్యారు. ఇందులో మృణాళ్ కూడా నటిస్తున్నా.. మెయిన్ హీరోయిన్ మాత్రం దీపికనే. ఈమెపై యాక్షన్ సీన్స్ బాగానే ప్లాన్ చేస్తున్నారు అట్లీ. కల్కి 2ను కాదనుకుని మరీ.. అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు దీపిక పదుకొనే. ప్రియాంక చోప్రా సైతం మరో ఏడాది వరకు టాలీవుడ్ హీరోయినే.. వారణాసితో తెగ బిజీ అయిపోయారీమే. ఎప్రిల్ 7, 2027న వారణాసి విడుదలయ్యే వరకు ప్రియాంక ఉండేది టాలీవుడ్‌లోనే..! ఇక త్రిప్తి దిమ్రి సైతం స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ముంబై బ్యూటీస్ కేరాఫ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా ‘లాస్ట్ పెగ్’ వేసి

Jio: జియో బంపర్‌ ఆఫర్‌..కేవలం రూ.200కే అన్నీ..!

ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి

మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు!

మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

Follow Us