Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లోకి రోహిత్ రీ ఎంట్రీ! అభిజిత్ ట్వీట్‌తో పెరిగిన అంచనాలు..

Updated on: Nov 06, 2026 | 6:29 PM

బిగ్‌బాస్‌ తెలుగు 10 నుంచి రోహిత్‌ నాయుడు ఎలిమినేషన్‌ తర్వాత ఆయన రీఎంట్రీపై సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. బిగ్‌బాస్‌ 4 విజేత అభిజిత్‌ ‘The Sun Will Shine Again’ అంటూ చేసిన ట్వీట్‌ ఈ చర్చకు కారణమైంది. రోహిత్‌ను ఉద్దేశించే ఈ పోస్ట్‌ చేశాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే రోహిత్‌ తిరిగి హౌస్‌లోకి వస్తాడనే విషయంపై నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్ ఎంతటి చర్చకు దారితీసిందో తెలిసిందే. ప్రేక్షకుల ఓటింగ్‌తో సంబంధం లేకుండా హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా రోహిత్‌ను బయటకు పంపించడంతో ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు రోహిత్ మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు రోహిత్ రీ ఎంట్రీ ఉంటుందా? లేదా? అనే ఆసక్తి మొదలైంది. ఈక్రమంలో అభిజిత్ ట్వీట్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! రోహిత్ రీ – ఎంట్రీ వార్తలకు ప్రధాన కారణం బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజిత్ చేసిన ఓ ట్వీట్. ‘The Sun Will Shine Again’ అంటూ అభిజిత్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ రోహిత్‌ను ఉద్దేశించే చేశాడని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి ముందు రోహిత్‌కు అభిజిత్ మార్గదర్శకత్వం వహించాడు. దీంతో అభిజిత్ ఇచ్చిన ఈ హింట్ రోహిత్ రీ ఎంట్రీకి సంకేతమా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు రోహిత్ రీ ఎంట్రీపై వస్తున్న వార్తలకు ఇప్పటివరకు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎలిమినేషన్ తర్వాత రోహిత్ తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడుపుతున్నట్లు సమాచారం. అలాగే ఆయన రీఎంట్రీ అవకాశాలు ప్రస్తుతానికి తక్కువగానే కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు. రోహిత్ ఎలిమినేషన్ తర్వాత ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వాలని, ఆయనను తిరిగి హౌస్‌లోకి తీసుకురావాలని అభిమానులు కోరుతున్నారు. గతంలో చరణ్, షాలిని వంటి కంటెస్టెంట్లకు మరో అవకాశం లభించడంతో రోహిత్ విషయంలోనూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramayana Part 1: హనుమాన్ ఎంట్రీ.. క్లైమాక్స్‌లో గూస్ బంప్స్‌ పక్కా..

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో రోహిత్‌కు అవమానం! AV వేయకపోవడానికి అసలు కారణం ఇదేనా..

60 ఏళ్ల వయసులో పెళ్లి.. విడాలకుల లొల్లి! బాధనంతా బయటపెట్టిన నటుడు

రామాయణ పార్ట్ 1 రిలీజ్ అయిన వేళ.. బాంబు పేల్చిన ప్రొడ్యూసర్

రాధికాకు.. SKN దిమ్మతిరిగే కౌంటర్

Loading...
Unable to load recommendations.
Follow Us