ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా

Updated on: Dec 06, 2025 | 4:14 PM

పునర్నవి భూపాలం తన ప్రియుడికి 'యస్' చెప్పి ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించింది. ఆమె పోస్ట్ చేసిన ప్రపోజల్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పునర్నవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు, బిగ్‌బాస్‌లో ఆమెతో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్ సిప్లిగంజ్ తన హనీమూన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరి ప్రముఖుల వ్యక్తిగత జీవిత విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పునర్నవి భూపాలం గురించి పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్ సీజన్-3లో పున్ను పాప చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవికి లవ్ ట్రాక్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీళ్లిద్దరూ హౌస్‌లో లవర్స్‌లా కనిపించినా బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఫ్రెండ్స్‌గా సెటిల్ అయిపోయారు. అయితే తాజాగా పునర్నవి తన ప్రేమని బయటపెట్టింది. త‌న‌కు కాబోయేవాడ్ని ప‌రిచ‌యం చేస్తూ పున‌ర్న‌వి ఓ పోస్ట్ పెట్టింది. ‘నేను అత‌నికి యస్ చెప్పాను’ అంటూ పున్ను తన లవర్‌ ప్రపోజ్‌ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు వీరికి శుభాకాంక్ష‌లు చెప్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయం కాస్త పక్కుకు పెడితే.. బిగ్ బాస్‌లో ఈమెకు ప్రపోజ్ చేసిన రాహుల్ మరో పక్క హనీ మూన్‌లో బిజీగా ఉన్నాడు. ఆయన కూడా ఇందుకు సంబంధించిన ఫోటోలతో వైరల్ అవుతున్నాడు. ఇలా ఇద్దరూ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీతూ తొండాట… సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు

సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఊరెళ్లేదెలా ??

ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులో కొత్త మార్పులు..