Ram Charan: స్టెరాయిడ్స్ లేవు.. ఇంజెక్షన్స్ లేవు.. శాఖాహార భోజనంతో వండర్స్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రం నుండి RC17 కోసం లీన్ లుక్‌లోకి మారి అభిమానులను ఆశ్చర్యపరిచారు. స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు వాడకుండా, కేవలం స్వచ్ఛమైన శాఖాహారం, ఇంటి భోజనం, క్రమశిక్షణతో ఈ అద్భుతమైన మార్పును సాధించారు. ప్రమాదకరమైన షార్ట్‌కట్‌లకు దూరంగా ఉంటూ, సహజమైన పద్ధతులతో ఫిట్‌నెస్‌ను ఎలా నిలబెట్టుకోవచ్చో చరణ్ నిరూపించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో సినీ వర్గాలను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. పెద్ది సినిమా కోసం భారీ కండలు పెంచి పహిల్వాన్‌గా కనిపించిన చరణ్, సుకుమార్ దర్శకత్వంలో రాబోయే RC17 కోసం సూపర్ లీన్ లుక్‌లోకి మారిపోయారు. ఈ మార్పునకు సాధారణంగా స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్ వంటి షార్ట్‌కట్స్ వాడుతుంటారు. అయితే రామ్ చరణ్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా, పూర్తిగా సహజమైన పద్ధతులను అనుసరించారు. అయ్యప్ప లేదా హనుమాన్ మాల ధారణలో ఉన్నప్పుడు ఆయన కేవలం సాత్విక, శాఖాహార భోజనాన్ని మాత్రమే తీసుకుంటారు. నాన్-వెజ్ జోలికి వెళ్లకుండా, పప్పులు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, పన్నీర్, టోఫు వంటి వాటితో ప్రోటీన్‌ను అందిస్తారు. శరీరానికి అవసరమైన పోషకాలను, కేలరీలను ఉపాసన కొనిదెల పక్కా ప్రణాళికతో ఇంట్లో వండిన ఆహారం ద్వారా అందిస్తారు. ట్రైనర్ రాకేష్ ఉడియార్ పర్యవేక్షణలో కఠినమైన వర్కవుట్స్‌ను చేస్తూ, క్రమశిక్షణ, ఇంటి భోజనం, సైంటిఫిక్ ట్రైనింగ్‌తో ఈ అద్భుతమైన ఫిట్‌నెస్‌ను చరణ్ సాధించారు. సహజసిద్ధమైన ఫిట్‌నెస్‌కు ఆయన ఒక నిదర్శనం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకప్పుడు సురేఖమ్మ దగ్గర 5వేల అప్పు ఇప్పుడు కోట్లలో ఆస్తులు!
కర్నూలు థియేటర్‌లో రహస్య కెమెరాలు.. కొత్త సినిమా వచ్చిందంటే యథేచ్ఛగా లీకే
ఇదో అన్ ప్రెడిక్టబుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ!
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్.. రూ.51కే అన్‌లిమిటెడ్ కాల్స్
