సీక్వెల్స్ ట్రెండ్.. మీడియం రేంజ్ సినిమాలకు అదే ఆయువుపట్టు

Edited By:

Updated on: Feb 11, 2026 | 8:19 PM

ఎంతసేపూ టాలీవుడ్‌లో సీక్వెల్స్ అనగానే కల్కి 2, సలార్ 2, దేవర 2 అంటూ భారీ సినిమాల గురించే డిస్కస్ చేస్తుంటాం. కానీ ఈ ప్యాన్ ఇండియన్ సీక్వెల్స్ కాకుండా.. మరికొన్ని మీడియం రేంజ్ సీక్వెల్స్ కూడా ఇండస్ట్రీలో సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలకు 100 కోట్ల రేంజ్ ఉంది. మరి ఏంటా మీడియం రేంజ్ క్రేజీ సీక్వెల్స్..? టాలీవుడ్‌లో సీక్వెల్స్ టైమ్ నడుస్తుందిప్పుడు. తరుణ్ భాస్కర్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

ఎంతసేపూ టాలీవుడ్‌లో సీక్వెల్స్ అనగానే కల్కి 2, సలార్ 2, దేవర 2 అంటూ భారీ సినిమాల గురించే డిస్కస్ చేస్తుంటాం. కానీ ఈ ప్యాన్ ఇండియన్ సీక్వెల్స్ కాకుండా.. మరికొన్ని మీడియం రేంజ్ సీక్వెల్స్ కూడా ఇండస్ట్రీలో సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలకు 100 కోట్ల రేంజ్ ఉంది. మరి ఏంటా మీడియం రేంజ్ క్రేజీ సీక్వెల్స్..? టాలీవుడ్‌లో సీక్వెల్స్ టైమ్ నడుస్తుందిప్పుడు. తరుణ్ భాస్కర్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసారీయన. ఓవైపు నటుడిగా బిజీగా ఉంటూనే.. మరోవైపు దర్శకుడిగా సత్తా చూపిస్తున్నారు. జూలై నుంచి ఈ నగరానికి ఏమైంది 2 సెట్స్‌పైకి వచ్చేలా కనిపిస్తుంది. 2027 ఫస్టాఫ్‌లో ఈ సీక్వెల్ రానుంది. తేజ సజ్జా అయితే కేరాఫ్ సీక్వెల్స్‌గా మారిపోతున్నారు. ఈయన ఖాతాలో ఇప్పటికే జై హనుమాన్, మిరాయ్ 2, జాంబి రెడ్డి 2 ఉన్నాయి. వాటన్నింటికీ 100 నుంచి 200 కోట్ల రేంజ్ ఉంది. మరోవైపు కిరణ్ అబ్బవరం క సినిమాకు పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారు. అలాగే నవీన్ పొలిశెట్టిని హీరోగా నిలబెట్టిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు సీక్వెల్ ఉండబోతుంది. అడివి శేష్ తను చేసిన ప్రతీ సినిమాకు సీక్వెల్ కథ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గూడఛారి 2 రానుంది. అజయ్ భూపతి మంగళవారం 2.. కళ్యాణ్ రామ్ బింబిసార 2 ఇప్పటికే అనౌన్స్ చేసారు. కథ కుదిర్తే సెట్స్ పైకి తీసుకెళ్లడమే తరువాయి. ఇక సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి మ్యాడ్ క్యూబ్, టిల్లు క్యూబ్ రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ అన్నీ 100 కోట్ల మార్కెట్ ఉన్నవే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోంది ??

2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..

Jr NTR: ఎన్టీఆర్‌పై వార్ 2 ఎఫెక్ట్.. ఆ మాత్రం ఉంటుందిలే

Musi River: మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే ??