వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియో

Updated on: Dec 07, 2025 | 1:16 PM

బాలయ్య అఖండ 2 సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఈగర్‌ గా వెయిట్ చేస్తున్న క్రమంలోనే.. కొన్ని కారణాల వల్ల.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్న బాలయ్య ఫ్యాన్స్‌ ఇప్పుడు వేణు స్వామిని టార్గెట్ చేశారు. గతంలో ఓ వీడియోలో... బాలయ్య పేరు చెప్పకుండా... ఓ హీరో కోసం పూజలు చేస్తున్నానంటూ వేణు స్వామి చెప్పాడు.

ఓ స్టార్ హీరో సినిమా కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నానని.. ఆ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆ వీడియోలో వేణు స్వామి చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం చెప్పకున్నా.. వేణు స్వామి మాట్లాడేది బాలయ్య అఖండ2 గురించేనని అప్పట్లో నిర్ణయానికి వచ్చారు ఫ్యాన్స్. అయితే బాలయ్య అఖండ2 సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో కొంత మంది ఈయన చేసిన పూజలను తప్పుబడుతున్నారు. ‘ఏ ఉద్దేశ్యంతో పూజలు చేశారో.. మా హీరో సినిమా ఇలా అయింది’ అంటూ.. అఖండ2 మేకర్స్‌ పై ఉన్న కోపాన్ని వేణు స్వామి మీదికి మళ్లించారు బాలయ్య ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం :

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో