50 రూపాయలకే సినిమా.. వర్కవుట్ అవుతుందా..?

Edited By:

Updated on: Jun 14, 2026 | 7:47 PM

సినిమా టికెట్ ధరలు ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు రూ.50 టికెట్ ఆఫర్లు ఇస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో భారీ చిత్రాలకు టికెట్ ధరలు పెరుగుతున్నాయి. ప్రేక్షకులపై పెరుగుతున్న భారం, థియేటర్లకు తగ్గుతున్న ఆదరణ, డైనమిక్ ప్రైసింగ్ అవసరంపై ఈ చర్చ దృష్టి సారిస్తోంది.

ఇండస్ట్రీ ఏదైనా టికెట్ రేట్లే ప్రధాన సమస్యగా మారుతున్నాయా..? ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయా…? ఈ రోజుల్లో అసలు 50 రూపాయలకు సినిమా చూపించడం సాధ్యమేనా..? మరి బాలీవుడ్‌లో ఆ సినిమాకెలా సాధ్యమైంది..? ఓ సినిమాకు 1000 రూపాయలు.. మరో సినిమాకు 50 రూపాయలు.. ఏంటీ తేడా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది టికెట్ రేట్లే..! ఒక్కోచోట ఒక్కోలా ఇవి ఉన్నాయి.. మెట్రో సిటీస్‌లో రేట్లు వందల్లో కాదు వేలల్లో కూడా ఉన్నాయి. కానీ కొన్నిచోట్ల ఓన్లీ 50 రూపాయలే అంటున్నారు నిర్మాతలు. తాజాగా మనోజ్ బాజ్‌పెయి నటించిన గవర్నర్ సినిమాను కేవలం 50 రూపాయలకే చూపించారు మేకర్స్. ఈ రోజుల్లో 100 రూపాయలకే సినిమా చూపించడం కష్టం అనుకుంటే.. గవర్నర్ సినిమా యూనిట్ అందులో సగానికే చూపించింది. మొదటి 25000 మంది ఆడియన్స్‌కు కేవలం 50 రూపాయల టికెట్‌కే సినిమా చూపించారు వాళ్లు. గవర్నర్ సినిమాకు ఇది హెల్ప్ అయింది కూడా. గతంలోనూ కొన్ని సినిమాలకు.. రాబోయే బడా సినిమాలకు కూడా 1+1 ఆఫర్ ఇస్తుంటారు నార్త్ నిర్మాతలు. బాలీవుడ్‌లో ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించడానికి ఎన్నో జిమ్మిక్కులు చేస్తుంటారు మేకర్స్. అదే సౌత్‌కు.. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి టికెట్ రేట్ల పంచాయతీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రతీ పెద్ద సినిమాకు రేట్లు పెంచేస్తుంటారు. బడ్జెట్ సాకు చూపించి పెంచుకుంటూ ఆడియన్స్‌పై భారం వేస్తున్నారనే విమర్శలున్నాయి. నార్త్‌లో ఫ్లెక్సీ రేట్లు ఉంటాయి.. డిమాండ్ అండ్ సప్లై అన్నట్లు వీకెండ్స్‌లో రేట్లు ఎక్కువగా ఉన్నా.. వీక్ డేస్‌లో వాటిని తగ్గిస్తారు. కానీ సౌత్‌లో ఆ సౌలభ్యం లేదు. ఇక్కడ తొలి 10 రోజుల పాటు రేట్లు పెరిగే ఉంటాయి. ఆడియన్స్ థియేటర్లకు రావడానికి 50 రూపాయలంటూ అక్కడ ఆఫర్లు ఇస్తుంటే.. మన దగ్గర మాత్రం అటూఇటూగా 500 రూపాయలు అంటున్నారు. ఈ తేడా తగ్గితేనే థియేటర్లకు మునపటి కళ వస్తుందేమో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌కే టైం బాంబ్‌లా..రూ.1000 కోట్ల కల

Peddi: పెద్ది హిట్టా..? ఫట్టా..? ఫైనల్‌గా కలెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి?

పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ

ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

Follow Us