Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ

Updated on: Mar 18, 2026 | 6:27 PM

జబర్దస్త్ అప్పారావు తన ముఖం నలుపు రంగు వెనుక ఉన్న షాకింగ్ రహస్యాన్ని వెల్లడించారు. 'ఒంగోలు గిత్త' సినిమా కోసం వేసుకున్న హెయిర్ డైలోని అమోనియా వల్ల తన చర్మం నల్లబడిందని, అది మొదట తనకు తెలియదని చెప్పారు. దీనిని తన కెరీర్‌కు ప్లస్‌గా, 'మాస్టర్ బ్లాక్'‌గా భావిస్తున్నానని తెలిపారు. నలుపు తగ్గించడానికి చికిత్స ప్రయత్నించినా, సమయాభావం వల్ల మధ్యలోనే వదిలేశానని, అయినా ఈవెంట్స్‌లో హెయిర్ డై వాడుతున్నానని వివరించారు.

అప్పారావు! సినిమాల్లో కంటే.. జబర్దస్త్‌తో ఎక్కువ పాపులారిటీ సంపారించుకున్న అప్పారాజు.. ఆ షో తర్వాత జడర్దస్త్‌ అప్పారావుగా మంచి ఫాలోవయింగ్‌ ను సంపాదించుకున్నాడు. చూడ్డానికి కాస్త లావుగా.. నల్లగా ఉంటే అప్పారావు.. తన దైన పంచులతో అందర్నీ నవ్విస్తుంటారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన అప్పారావు.. తన నలుపు రంగు వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ స్టోరీని అందరితో పంచుకున్నారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఒంగోలు గిత్త సినిమా కోసం హెయిర్ కలర్ వేసుకున్నానని, దానిలో ఉండే అమోనియా వల్ల తన ముఖం నల్లబడిందంటూ షాకింగ్ విషయాన్ని చెప్పారు అప్పారావు. అయితే వైజాగ్ లో ఒక మేకప్ ఆర్టిస్ట్ వివరించిన తర్వాతే.. తనకు కూడా తెలిసిదంటూ చెప్పుకొచ్చారు. హెయిర్ కలర్ లో ఉన్న అమోనియా వల్ల తన ముఖం అంతా నల్లబడినప్పటికీ, దాని వల్ల తనకు మంచే జరిగిందన్నారు అప్పారావు. మాస్టర్ బ్లాక్ గా మారానని.. అది తన కెరీర్‌కు ప్లస్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు తెలిసిన ఓ బ్యుటీషన్ .. తన ముఖంలోని నలుపు రంగును తగ్గంచేందుకు ట్రీట్మెంట్ ఇచ్చిందని.. అయితే అందుకు నాలుగు సిట్టింగ్‌ల అవసరం కావడంతో.. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక … ట్రీట్మెంట్‌ మధ్యలో వదిలేసినట్టు చెప్పుకొచ్చారు అప్పారావు. అయినప్పటికీ.. రచ్చ రవి సలహా మేరకు, తాను ఇప్పటికీ పలు ఈవెంట్స్‌కు వెళ్ళినప్పుడు యంగ్‌గా, యాక్టివ్‌గా కనిపించడానికి హెయిర్ కలర్ వేస్తూనే ఉంటానని అప్పారావు చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా

దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..

ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో

Follow Us