Anupama Parameswaran: అనుపమ ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి ?? తర్వాత సినిమాలు విజయాలను అందుకుంటుందా

Edited By:

Updated on: Apr 10, 2026 | 4:21 PM

అనుపమ పరమేశ్వరన్ సినిమా ఎంపికలో వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నారు. కథ, నేపథ్యం, కొత్తదనం ఉన్న చిత్రాలకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గత ఏడాది అరడజను చిత్రాలతో మెప్పించిన అనుపమ, ఈ ఏడాది 'క్రేజీ కల్యాణం', షాన్‌తో సినిమా వంటి ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నటిగా ఎదిగినా, దర్శకురాలిగా ప్రూవ్ చేసుకోవాలనే తన కలను నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నారు.

అనుపమ పరమేశ్వరన్ లాస్ట్ ఇయర్ ఎన్ని సినిమాలు చేశారో తెలుసా? ఆ నెంబర్‌ ని ఈ ఇయర్ రిపీట్‌ చేస్తారా? అసలు సినిమాల సెలక్షన్ విషయంలో ఆమె ఫాలో అవుతున్న విధానం ఏంటి? డైరక్షన్ కలలను సైడ్‌ చేసేశారా? ఇలాంటి చాలా విషయాలు డిస్కస్‌ చేసుకుందాం వచ్చేయండి. సినిమాల ఎంపికలో అనుపమ పరమేశ్వరన్‌ తన ప్రాధాన్యతలను మార్చుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అనుపమ సైన్‌ చేశారంటే సినిమాలో ఏదో స్పెషాలిటీ ఉండి తీరుతుందని ఇప్పటికే చాలా మంది ఫిక్సయ్యారు. అయితే నేపథ్యం, లేకుంటే కథ, కథనం.. ఎక్కడో ఏదో కొత్తగా ఉంటేనే సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు ఈ బ్యూటీ. లాస్ట్ ఇయర్‌ ఏకంగా అరడజను సినిమాలతో మెప్పించారు అనుపమ. వాటిలో కొన్ని పెద్దగా ఆడకపోయినా, మరికొన్ని మాత్రం ఆమెకు చాలా సినిమాలను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది కూడా లాక్ డౌన్‌ మూవీ ఉంది ఆమె ఖాతాలో. మరోవైపు తెలుగులో క్రేజీ కల్యాణం అనే సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు షాన్‌ తో అనుపమ మూవీ కూడా ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ క్రియేట్‌ చేస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ఓ షార్ట్ పిల్మ్ జనాల్లో సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు అదే జోడీ తెరమీదకు రానుండటంతో క్రేజీ బజ్ స్టార్ట్ అయింది. నటిగా ఎంత ఎదిగినా, డైరక్టర్‌గానూ ప్రూవ్‌ చేసుకోవాలన్నది ఈ బ్యూటీ డ్రీమ్‌. అందుకే ఏ సెట్లో ఉన్నా, డైరక్షన్ డిపార్ట్ మెంట్‌ లో పనిచేస్తున్నట్టుగానే ఫీలవుతున్నానంటారు ఈ లేడీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రణ్‌బీర్‌ వర్సెస్‌ రణ్‌వీర్‌.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు

Peddi: పెద్దితో వారణాసి.. గట్టిగా వైరల్‌ అవుతున్న పెద్ది స్పెషల్‌ సాంగ్‌ న్యూస్‌

ఇండస్ట్రీలో వైరల్‌ అవుతున్న హీరోయిన్ల అలవాట్లు

సినిమాలకు క్రేజ్‌ తీసుకొస్తున్న సెలబ్రిటీ కపుల్‌

బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో

Follow Us