సాయిపల్లవిని ఛేజ్ చేస్తున్న అనుపమ.. సక్సెస్ అవుతారా?
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది 'బైసన్', 'డ్రాగన్ కిష్కిందపురి' వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకుంది. 'ఆ ఆ' సినిమాతో తెలుగు నేర్చుకుని, గ్లామర్, పెర్ఫార్మెన్స్ రోల్స్ రెండింటిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సాయి పల్లవికి గట్టి పోటీనిచ్చే స్థాయికి చేరుకుందని ప్రశంసలు అందుకుంటోంది.
మనం మనలా ఉంటూనే, ఇంకొకరిని కూడా గుర్తుచేసేయాలి. వీలైతే వాళ్లని దాటేయడానికి ట్రై చేయాలి. ఓపిక, ఉత్సాహం, ప్యాషన్, అవకాశాలు.. ఇవన్నీ ఇంటర్‌లింక్డ్…ఏమంటారూ.. అంతేనా? మనం మనం అంతే అనుకోవం కాదు.. అనుపమ కూడా అదే మాటే అంటున్నారు. నియర్ ఫ్యూచర్‌లో సాయి పల్లవిని ఈ లేడీ బీట్ చేస్తారా? అ ఆ సినిమాలో అనుపమ కేరక్టర్‌ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. కనిపించింది కాసేపే అయినా గుర్తుండిపోయిందా రోల్. ఆ సినిమాతోనే తెలుగు నేర్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా బైసన్ మూవీకి మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది అనుపమకి చాలా బాా కలిసొచ్చిందనే చెప్పాలి. డ్రాగన్ కిష్కిందపురి, బైసన్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీతో మళ్లీ మలయాళంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. పరదా థియేటర్లలో ఆడకపోయినా తన మనసుకు దగ్గరైన మూవీ అని చాలా సార్లు చెప్పారు అనుపమ. ఆ మధ్య పెట్ డిటెక్టివ్ తో పలకరించిన ఈ లేడీ, డిసెంబర్ 5న లాక్‌డౌన్‌తో మరోసారి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఒకే ఏడాది ఆల్రెడీ ఆరు రిలీజులు, ఇంకో సినిమా కమింగ్ సూన్ అంటూ రఫ్ఫాడించేస్తున్నారు. గ్లామర్, పెర్ఫార్మెన్స్ అనే తేడా లేకుండా అన్నీ రోల్స్ కీ సూట్ అవుతూ.. త్వరలోనే సాయిపల్లవికి టఫ్ కాంపిటిషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు. అన్నట్టు, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ జోరుని కంటిన్యూ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకున్నట్టేనా?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా
Akhanda 2: బాలయ్యకు గుడ్ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?
‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్ స్టేషన్‌కు శేఖర్ బాషా!
సామ్ లాగే ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ??