స్టార్ నటుడి ఆఫీస్‌లో దొంగలు పడ్డారు.. ఇదిగో వీడియో !!

|

Jun 22, 2024 | 9:23 AM

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‏కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లో అతడు పోషించే పాత్రలకు.. నటనకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన అనుపమ్ ఖేర్ రీసెంట్‌గా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే అనుపమ ఖేర్.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం హిందుత్వం గురించి మాట్లాడుతూ వీడియోస్ షేర్ చేస్తుంటారు.

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‏కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లో అతడు పోషించే పాత్రలకు.. నటనకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన అనుపమ్ ఖేర్ రీసెంట్‌గా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే అనుపమ ఖేర్.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం హిందుత్వం గురించి మాట్లాడుతూ వీడియోస్ షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ్ ఖేర్ తన ఆఫీస్లో దొంగలు పడ్డారంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. “నిన్న రాత్రి ఇద్దరు దొంగలు నా వీర దేశాయ్ రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి చొరబడ్డారు. తలుపు పగులగొట్టి లోపలికి వచ్చి అకౌంట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీలో ఉన్న సినిమా నెగిటివ్స్ దొంగిలించారు. ఈ విషయంపై మా ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సీసీటీవీలో ఇద్దరు దొంగలు వెళ్తున్న విజువల్స్ కనిపించారు. వారికి దేవుడు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పోలీసులు రాకముందే ఆఫీస్ బయట ఉన్న వ్యక్తులు వీడియో తీశారు” అంటూ రాసుకొచ్చారు అనుపమ్ ఖేర్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Love Mouli: అప్పుడే OTTలోకి వస్తోన్న నవదీప్‌ లవ్‌ మౌళి

Follow us on