రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది

Updated on: Apr 03, 2026 | 3:40 PM

నటి రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ఏడాది క్రితం 'బ్లూమ్ మ్యాగజైన్' కవర్‌ పేజీపై 'యంగ్ సూపర్ స్టార్స్' ట్యాగ్‌తో కనిపించిన ఆమె ఫొటోను, తాజాగా మ్యాగజైన్ 20 ఏళ్ల వేడుకల ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఈ సంతోషకరమైన వార్తను అన్షు సోషల్ మీడియాలో పంచుకుంది, తన తండ్రి సెల్వమణితో కలిసి ఈ వేడుకకు హాజరైన ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ నటి రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తోన్న ఆమె మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికలపై అవార్డులు, ప్రశంసలు అందుకుందీ స్టార్ కిడ్. తాజాగా అన్షు మాలిక మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఏడాది క్రితం ‘బ్లూమ్ మ్యాగజైన్’ కవర్‌ పేజీపై ‘యంగ్ సూపర్ స్టార్స్’ ట్యాగ్‌తో కనిపించింది అన్షు. ఇసాక్ అసారే, నిషెల్ విట్నీ వాష్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఆ గౌరవాన్ని అందుకుంది. తాజాగా బ్లూమ్ మ్యాగజైన్ 20 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఆ కవర్ పేజీని ప్రదర్శించారు. తన ఫొటోను అలా ఎగ్జిబిషన్‌లో చూడటం తనకు ఎంతో గర్వంగా అనిపిస్తోందని అన్షు సంబరపడిపోతోంది. ఇక ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు తన తండ్రి సెల్వమణితో కలిసి ఫౌంటైన్ స్క్వేర్ మాల్‌కు వెళ్లింది అన్షు. అక్కడి ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఆమె.. నాన్నతో పాటు ఈ ఈవెంట్‌కు వెళ్లడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని.. ఈ క్షణాలను మరింత మధురంగా మార్చిందని.. తన పోస్టులో రాసుకొచ్చింది. ఒకప్పుడు కేవలం ఒక మైలురాయిగా అనిపించిన విషయం, ఇప్పుడు ఒక పెద్ద చరిత్రలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ అన్షు తన పోస్టులో కోట్ చేసింది. ఈ ప్రయాణంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన ఎలిజబెత్ ఎల్లిస్, రోడ్నీ మార్గిసన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తన పోస్ట్ లో మెన్షన్ చేసింది అన్షు. ఇక ప్రస్తుతం రోజా కూతురు షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అన్షుకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు

Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Follow Us