వైరల్‌ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా

Updated on: Apr 18, 2026 | 1:27 PM

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోపై క్లారిటీ ఇచ్చారు. తీన్మార్ ఈవెంట్‌లో పవన్ పక్కన ఉన్న మహిళ తాను కాదని, ఆమె డానా మార్క్స్ అని స్పష్టం చేశారు. చాలా కాలంగా ఈ ఫోటోను తనదని పొరబడుతున్నారని తెలిపారు. తాను మోడల్‌ని గానీ, నటిని గానీ కాదని వెల్లడించారు. అన్నా ప్రస్తుతం నెట్టింట యాక్టివ్‌గా ఉన్నారు.

రీసెంట్‌గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ వైఫ్‌ అన్నా లెజినోవా.. నెట్టింట తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. తన పర్సనల్ విషయాలతో పాటు.. పవన్‌తో రిలేషన్‌ షిప్ ఎలా మొదలైంది వంటి సంగతులను తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే తన పేరుతో వైరల్ అవుతున్న ఓ ఫోటోపై క్లారిటీ ఇచ్చారు అన్నా లెజినోవా..! చాలా ఏళ్లుగా అన్నా లెజినోవా ఈమే అంటూ.. ఓ ఫోటో వైరల్ అవుతోంది. తీన్మార్ సినిమా ఈవెంట్లో పవన్‌ పక్కన కూర్చున్న ఆ ఫారెన్ లేడీనే అన్నా అని.. ప్రచారమూ జరిగింది. అయితే ఇప్పుడా ఫోటోను తన స్టోరీలో షేర్ చేసిన అన్నా లెజినోవా.. ఆ అమ్మాయి తాను కాదంటూ క్లారిటీ ఇచ్చారు. పవన్‌ పక్కన కూర్చున్న ఆ అమ్మాయి డానా మార్క్స్‌ అని.. అందరూ అనుకున్నట్టు ఆ అమ్మాయిని తాను కాదంటూ అన్నా తన స్టోరీలో మెన్షన్ చేశారు. అంతేకాదు తాను ఎప్పుడూ మోడల్‌లాగా గానీ, నటిలాగా గానీ కనిపించలేదని ఆమె స్పష్టం చేశారు. మరి ఇప్పుడైనా అన్నా లెజినోవా అనగానే గూగుల్ ఈ ఫోటోను చూపించడం ఆగుతుందో లేదో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రొజెక్టర్ రూమ్‌లో చనిపోతే.. దొంగచాటుగా పుట్‌పాత్‌పై పడేస్తారా ??

రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

Follow Us