Allu Arjun: ఇంటికెళ్లి మరీ పవన్‌ను పరామర్శించిన బన్నీ

Updated on: Jun 12, 2026 | 5:48 PM

ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించినట్లు సమాచారం. ఇద్దరూ ఆరోగ్యం, కుటుంబ విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మెగా-అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయనే ప్రచారానికి ఈ భేటీతో చెక్ పడుతుందా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం పవన్ రాజకీయాలపై, అల్లు అర్జున్ తన కొత్త సినిమా ‘రాకా’పై దృష్టి సారిస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇటీవలే సర్జరీ జరిగింది. కొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోన్న ఆయన ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నారు. మరీ ముఖ్యమైన కార్యక్రమాలుంటే తప్పితే పవన్ బయటకు రావడం లేదు. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవర్ స్టార్ ఇంటికెళ్లి ఆయనను పరామర్శిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించినట్లు తెలుస్తోంది. పవన్ హెల్త్ కండిషన్ తో పాటు ఫ్యామిలీ విషయాల గురించి కూడా ఇద్దరు చర్చించుకున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇప్పుడు సినిమాకలు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా పూర్తిగా ఏపీ పరిపాలనపైనే దృష్టి సారించారు. మరోవైపు అల్లు అర్జున్ తన సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో రాకా అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 800 కోట్లతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?

కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !

5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది

ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?

ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్‌ మొత్తం పాయె!

Published on: Jun 12, 2026 05:47 PM
Loading...
Unable to load recommendations.
Follow Us