దిమ్మతిరిగే న్యూస్.. బన్నీతో బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్ సినిమా

|

Jan 12, 2025 | 12:54 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప ది రైజ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అద్భుతమైన నటనకు ఏకంగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.

డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాహుబలి రికార్డ్ సైతం బ్రేక్ చేసింది. ఇక ఈక్రమంలోనే అల్లు అర్జున్‌ అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ న్యూస్ ఏంటంటే..! అల్లు అర్జున్, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కలిసి ఓ సినిమా చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే బన్నీ చర్చలు కూడా మొదలెట్టాడట. అంతేకాదు ఈ న్యూస్‌కు బలం చేకూరేలా.. అల్లు అర్జున్ రీసెంట్‌గా ముంబై వెళ్లాడు. అక్కడ డైరెక్టర్ భన్సాలీ ఆఫీసులో కనిపించాడు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందనే న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన హీరో

‘బాగా పొగరు’.. నిత్యా చేసిన పనిపై నెటిజన్స్ మండిపాటు

పవన్‌, నాగబాబు.. ఇంట్లో ఏం చేసేవారో బయటపెట్టిన చరణ్‌

Published on: Jan 12, 2025 12:49 PM