చిట్టి చేతులతో.. ముద్దుగా మట్టి బొమ్మలు అర్హ క్యూట్ వీడియో
అల్లు స్నేహా రెడ్డి తన కూతురు అల్లు అర్హకు చిన్నప్పటి నుంచే కళలను నేర్పిస్తోంది. తాజాగా, అర్హ మట్టి దీపాలు తయారుచేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తల్లి స్నేహా రెడ్డి పర్యవేక్షణలో అర్హ ఎంతో చక్కగా కుమ్మరి పని చేసింది. ఈ ఫోటోలను అభిమానులు, నెటిజన్లు ఆనందిస్తున్నారు, అర్హ ప్రతిభను ప్రశంసిస్తున్నారు.
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను అందరూ తరచూ షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా అల్లు అర్హ, అయాన్ ల వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. అందులోనూ అల్లు అర్హ ఫొటోలు, వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్హకు సంబంధించి స్నేహా రెడ్డి షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అందులో అల్లు స్నేహా రెడ్డి చిన్నప్పటి నుంచే తన పిల్లలకు అన్ని కళలను నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన కూతురు అల్లు అర్హతో దగ్గరుండి మరీ కుమ్మరి పని చేయించింది. మట్టితో అందమైన దీపాలను తయారు చేయించింది. తల్లి సాయంతో అల్లు అర్హ కూడా ఎంతో చక్కగా మట్టి దీపాలను తయారుచేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్ గారాల పట్టి ట్యాలెంట్ కు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ది గార్దియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో హాలీవుడ్ లెవల్లో అత్యాధునిక హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనె ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటోలో దూసుకెళ్తున్న డ్రైవర్.. వెనుక సీటులో ఉన్నది చూసి..
బియ్యం ధర గిన్నీస్ వరల్డ్ రికార్డ్.. తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
ఆధార్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్
ఇకపై విమానాలకు ఇంధనంగా వంటనూనె !!
వేల కోట్ల వ్యాపారాలకు వారసుడు.. అయినా రాత్రిళ్లు క్యాబ్ నడుపుతూ
