Major movie in Pakistan: పాకిస్తాన్‌లో రికార్డు సృష్టించిన మేజర్‌.. ఓటీటీ సైతం టాప్‌-10 ట్రెండింగ్‌ లో..

|

Jul 11, 2022 | 8:37 PM

26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా శశికిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్‌’. యంగ్‌ హీరో అడివిశేష్‌ సందీప్‌ పాత్రలో నటించారు.


26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా శశికిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్‌’. యంగ్‌ హీరో అడివిశేష్‌ సందీప్‌ పాత్రలో నటించారు. జూన్ 3న తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర డీసెంట్ కలెక్షన్లను సాధించింది. సిల్వర్‌స్ర్కీన్‌పై మెస్మరైజ్‌ చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. జులై 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రసారమవుతోంది.కాగా సిల్వర్‌ స్ర్కీన్‌పై సత్తా చాటిన మేజర్‌ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌-10 ట్రెండింగ్ సినిమాల లిస్టులో మేజర్‌ సినిమాకే అగ్రతాంబూలం దక్కింది. ఈ జాబితాలో మేజర్‌ హిందీ వెర్షన్‌ మొదటి స్థానంలో ఉండగా, తెలుగు వెర్షన్‌ రెండో స్థానంలో ఉందని నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా తెలిపింది. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల్లోనూ మేజర్‌కు సినిమాకు అపూర్వ స్పందన వస్తోంది. ఈ దేశాల్లోని నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌-10 ట్రెండింగ్‌ మూవీస్‌ లిస్టులో మేజర్‌ మొదటి స్థానంలో ఉందని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇండియా లవ్స్ మేజర్‌ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు హీరో శేష్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us on