Andrea Jeremiah: అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..

Updated on: Nov 22, 2024 | 9:46 AM

ఇటీవల సినీతారల తమ వ్యక్తిగత సమస్యలు బయటపెట్టేందుకు అసలు ఆలోచించడం లేదు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో ఆరోగ్య సమస్యలను పంచుకుంటున్నారు. ఇదివరకే తాను మయోసైటిస్ సమస్యతో బాధ పడుతున్నట్లు హీరోయిన్ సమంత వెల్లడించింది. అలాగే తాను తీసుకుంటున్న చికిత్స గురించి ప్రతిసారి అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను మరింత అలర్ట్ చేసింది.

తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తనెవరో కాదు.. హీరోయిన్ , సింగర్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ అయిన ఆండ్రియా జెరెమియా.! ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా.. అనేక విషయాలను పంచుకుంది. ఈక్రమంలోనే వడ చెన్నై సినిమా తర్వాత తనకు ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ ఉన్నట్టు తెలిసిందంటూ చెప్పింది. ఈ వ్యాధి రావడంతో కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారడం ప్రారంభించాయని చెప్పింది. రోజూ నిద్ర లేవగానే శరీరంపై ఎన్నో మచ్చలు కనిపిస్తాయని… రక్త పరీక్షలో వ్యాధిని గుర్తించలేమని చెప్పింది. అంతేకాదు ఈ పరిస్థితికి కారణం మానసిక ఒత్తిడి అనుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఈ సమస్య వల్లే.. తాను సినిమాలకు దూరంగా ఉన్నానని.. కానీ తాను బ్రేక్ తీసుకోవడంతో తనకు లవ్ బ్రేకప్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లానంటూ వార్తలు వచ్చాయని తెలిపింది. ఈ వ్యాధికి సంబంధించిన అనేక మచ్చలు ఇప్పటికీ శరీరంపై ఉన్నాయని.. ఇంకా కనురెప్పలు తెల్లగా ఉన్నాయని.. ఇందుకు ఆక్యుపంక్చర్ ట్రీట్ మెంట్ తనకు మేలు చేసిందని చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us