Rajasekhar: రాజశేఖర్‌కు షూటింగ్ లో ప్రమాదం.. డి కాలికి తీవ్ర గాయం

Updated on: Dec 10, 2025 | 11:52 AM

టాలీవుడ్ నటుడు రాజశేఖర్‌కు సినిమా షూటింగ్‌లో తీవ్ర గాయం అయ్యింది. మేడ్చల్ వద్ద యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా కాలికి బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేసి ప్లేట్లు, వైర్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్ కు ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. కాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం నటుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. తమిళంలో విజయవంతమైన ‘లబ్బర్ పందు’ రీమేక్‌లో నటిస్తున్నారు రాజశేఖర్. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా, రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే సీనియర్ హీరో, హీరోయిన్లు రాజశేఖర్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు . ఇప్పుడీ సినిమా షూటింగులో నే రాజశేఖర్ గాయపడ్డారని తెలుస్తోంది. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా కాలికి గాయాలు అయ్యాయి. యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయాలు అయ్యాయి. మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది. బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ & వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు.రాజశేఖర్‌కు గాయం కావడంతో సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చిత్రీకరణను తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దివ్వెల మాధురిపై రీతూ తల్లి సెటైర్లు.. అబద్దాలు ఆడితే ఇలానే ఉంటది