టికెట్ రేట్లపై మరోసారి చర్చ.. ఒక్క టికెట్ కోసం రూ.90 వేల ఖర్చు
హాలీవుడ్‌లో డ్యూన్ 3 టికెట్లు 90 వేలకు అమ్ముడుపోవడం, ఒడిస్సీ బుకింగ్‌లు ఏడాది ముందే సోల్డ్ ఔట్ అవ్వడం సినిమాటిక్ అనుభూతికి ప్రేక్షకులు ఎంతైనా చెల్లిస్తారని చూపిస్తుంది. టాలీవుడ్‌లోనూ RRR, పుష్ప 2 వంటి చిత్రాలకు భారీ ధరలు అభ్యంతరం కాలేదు. కంటెంట్, విజువల్ క్వాలిటీ ఉంటే రేటు సమస్య కాదని స్పష్టమవుతోంది. మన దగ్గర కూడా అలాంటి విజువల్ వండర్స్ వస్తే ప్రేక్షకులు సిద్ధమే.
ఒక్క సినిమా టికెట్ రేటు 90 వేలు.. మీరు విన్నది నిజమే అక్షరాలా 90 వేలు.. ఎహే ఊరుకోండి అంతెందుకు పెడతారు.. పెట్టినా ఆడియన్స్ చూస్తారా అనుకోవచ్చు కానీ చూస్తున్నారిక్కడ..! కంటెంట్ కనెక్ట్ అయితే టికెట్ రేట్ అనేది అసలు మ్యాటరే కాదా..? విజువల్ ఫీస్ట్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులకు రేట్ సమస్య కాదా..? మన దగ్గర కూడా ఇది వర్కవుట్ అయ్యేనా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. టాలీవుడ్‌లో టికెట్ రేట్ల రచ్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అయితే హాలీవుడ్‌లో డ్యూన్ 3 సినిమా టికెట్స్ ప్రేక్షకులు ఏకంగా 90 వేల రూపాయలు పెట్టి కొనడం వరల్డ్‌వైడ్ హాట్ టాపిక్ అయిందిప్పుడు. అది కూడా రిలీజ్‌కి ఇంకా 9 నెలల సమయం ఉన్నప్పటికీ.. బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే అమ్ముడైపోవడం ఆ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. డ్యూన్ 3 మాత్రమే కాదు.. క్రిస్టోఫర్ నోలెన్ తెరకెక్కిస్తున్న ఒడిస్సీ టికెట్ బుకింగ్స్ ఏకంగా ఏడాది ముందే ఓపెన్ చేస్తే క్షణాల్లో సోల్డ్ ఔట్ అయిపోయాయి. 2026, జూలై 17న విడుదల కాబోయే ఈ సినిమా బుకింగ్స్ 2025, జూలైలోనే ఓపెన్ చేసారు. ఈ రెస్పాన్స్ చూస్తుంటే నిజమైన అసలు సిసలైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే నాలుగేళ్ళ కింద ట్రిపుల్ ఆర్‌కు భారీగా రేట్లు పెంచినా సరే సినిమా చూసేందుకు ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు.. పైగా ఎగబడి చూసారు. కానీ తర్వాత విజువల్ క్వాలిటీ లేకుండా కేవలం స్టార్ హీరోల ఇమేజ్ పేరు చెప్పి టికెట్ రేట్లు పెంచిన ప్రతీసారి ప్రేక్షకులు మేకర్స్‌పై దారుణంగా విరుచుకుపడుతున్నారు. పుష్ప 2 సినిమాకు కూడా రేట్లు పెంచినా ఆడియన్స్ చూశారు. కంటెంట్ ఉంటే రేట్లు పెద్ద విషయం కాదని తేలిపోయింది. రేపు ఫ్యూచర్‌లో మన దగ్గర కూడా డ్యూన్, ఒడిస్సీ లాంటి మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఉన్న మూవీస్ వస్తే.. 2 వేలు రేట్ పెట్టినా సరే ఆడియన్స్ చూస్తారేమో..? మరి మన దగ్గర టికెట్ రేట్లను కూడా మరిపించే విజువల్ వండర్స్ ఎప్పుడొస్తాయో చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కేస్తున్న టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్లు
NTR సినిమాపై కావాలనే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారా..?
Peddi: పెద్దిపై మరో పిడుగు.. రామ్ చరణ్ ఏం చేస్తారో..?
Anna Lezhneva: ఒకరికి బర్త్‌డే.. మరొకరికి పునర్జన్మ.. పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్