Banana: బనానా షేక్ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??
అరటిపండు పోషకాలతో నిండిన ఆహారం. అయితే, అరటిపండును నేరుగా తినాలా లేక బనానా షేక్ తాగాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిపుణుల ప్రకారం, పేగు సమస్యలున్నవారు పండును నేరుగా తీసుకోవడం మంచిది. జిమ్‌కు వెళ్లేవారు, ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునే పురుషులకు బనానా షేక్ మేలు చేస్తుంది. అయితే, సైనస్, జలుబు ఉన్నవారు షేక్‌ను తీసుకోకూడదు.
అరటిపండ్లు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అందుకే వైద్యులు కూడా అరటిపండును తినమని చెబుతారు. అయితే, మగవారిలో చాలా మంది ఉదయం జిమ్ కి వెళ్ళి రాగానే అరటి పండు లేక బనానా షేక్ ను తీసుకుంటారు. అసలు అరటిపండును పండులాగే తినాలా లేక బనానా షేక్ చేసుకుని తాగాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. బనానాను ఎలా తీసుకున్నా శరీరానికి శక్తినిస్తుంది. పేగు సమస్యలతో బాధ పడేవారు దానిని నేరుగా తీసుకోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జిమ్ కి వెళ్లే వారు అరటిపండును డైరెక్ట్ గా తినకుండా మిల్క్ షేక్ లాగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయట. అంతేకాదు, ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే పురుషులు బనానా షేక్ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుందట. సైనస్, జలుబు వంటి సమస్యలు ఉన్న వారు బనానా షేక్ ఎక్కువగా తీసుకోకూడదట. దీని వలన ఈ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహుబలికి, భన్సాలీ సినిమాకీ లింకేంటి ??
Mahesh Babu: కావాలంటే నా పాస్ పోర్టు చూపిస్తానంటున్న మహేష్… అసలేం జరిగింది
Raashii Khanna: రియల్ లైఫ్ లో పెద్ది డైలాగ్ ను ప్రాక్టీస్ చేస్తున్న రాశీ
Mrunal Thakur: అది అంత జోక్.. ఏప్రిల్ ఫూల్ అంటున్న మృణాల్
Suriya: స్ట్రాంగ్ లైనప్ ప్లాన్ చేసుకుంటున్న సూర్య.. ఈ సారి కొట్టే దెబ్బ అదుర్సే
