Chinna Jeeyar Swamy: మేము ఈరోజు ఉన్నా.. రేపు లేకున్నాసేవా కార్యక్రమాలు ఆగిపోకూడదు

Updated on: Nov 12, 2026 | 1:09 PM

వ్యక్తులు శాశ్వతం కాదని, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగడానికి అవి లక్ష్య ఆధారితంగా ఉండాలని చిన్న జీయర్ స్వామి ఉద్ఘాటించారు. వ్యక్తి కేంద్రంగా జరిగే కార్యక్రమాలు ఆ వ్యక్తి లేకపోతే ఆగిపోతాయని, అందుకే వ్యవస్థీకృత మద్దతుతో లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజం మెచ్చిన మంచి కార్యక్రమాలకు టీమ్‌లు తోడుగా నిలవాలి.

ముచ్చింతల్ శ్రీరామనగరంలో యతీంద్ర సప్తతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.. అయితే ఈ యతీంద్ర సప్తతి మహోత్సవాల్లో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవ వేడుకలు గురువారంతో ముగియనున్నాయి.

స్వామివారి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాు. 33వ సహస్ర కలశాభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. యతీంద్ర సప్తతి మహోత్సవాల ముగింపు వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. దీంతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక శోభతో విరాజల్లుతోంది.

సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ వ్యక్తి ఆధారితంగా కాకుండా, నిర్దిష్ట లక్ష్యాలను కేంద్రంగా చేసుకుని సాగాలని చిన్న జీయర్ స్వామి స్పష్టం చేశారు. వ్యక్తి ఆకర్షణతో మొదలయ్యే కార్యక్రమాలు ఆ వ్యక్తి అందుబాటులో లేనప్పుడు నిలిచిపోతాయని ఆయన అన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి, సేవా కార్యక్రమాలకు ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం అత్యవసరమని నొక్కి చెప్పారు. తాము చేపట్టిన కార్యక్రమాలు, ఇతర సంస్థలను ప్రోత్సహించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని స్వామి వివరించారు. వ్యక్తులు శాశ్వతం కాదని, అయితే తాము ఏర్పరచుకున్న లక్ష్యాలు మంచివని సమాజం అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు గుర్తించిన మంచి కార్యక్రమాలను లక్ష్యంగా పెట్టుకుని, ఆ లక్ష్య సాధన కోసం బృందాలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాంబ్‌లా పేలిన ఫ్రిడ్జ్‌.. ఇల్లు దగ్ధం!

వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!

వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్‌!

ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు! IRCTCకి వినియోగదారుల కమిషన్ షాక్!

రజనీ ‘ధర్మన్’లో రామ్ పోతినేని పవర్ ప్యాక్డ్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర గ్యారంటీ!

Published on: Nov 12, 2026 12:58 PM
Loading...
Unable to load recommendations.
Follow Us