Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!

Updated on: Mar 18, 2026 | 4:38 PM

అంతర్జాతీయ పరిస్థితులు, ఇరాన్ యుద్ధ ప్రభావంతో బంగారం, వెండి ధరలు విపరీతంగా మారుతున్నాయి. మార్చి 18న పసిడి ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రూ.330, 22 క్యారెట్ల బంగారం రూ.300 తగ్గగా, కిలో వెండి రూ.5000 తగ్గింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, తెలుగు రాష్ట్రాలలో నేటి ధరలను పరిశీలించి, కొనుగోలుకు ముందు ధృవీకరించుకోవాలి.

బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా పెరుగుతూ అదే సమయంలో ఒక్కసారిగా పడిపోతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తుంటే.. పసిడి ప్రియులు బంగారాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు, ఇరాన్ యుద్ధ ప్రభావం అని చెప్పవచ్చు.బంగారం ధరలు నిన్న భారీగా పెరిగితే ఈ రోజు కాస్త ఊరటనిచ్చాయి. మార్చి 18 బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.330 తగ్గి రూ.1,57,750లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి రూ.1,44,600 లుగా ఉంది. కిలో వెండిపై రూ.5000లు తగ్గి రూ.2,75,000లు పలుకుతోంది. మార్చి 18, బుధవారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,240 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,060 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,57,750 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,600 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,950 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,45,700 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,750 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,600 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,75,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్

Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..

గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌

మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు

ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??

Loading...
Unable to load recommendations.
Follow Us