ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి కేంద్రం కొత్త నిబంధనలు
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల రక్షణ కోసం కేంద్రం కొత్త ఈ-కామర్స్ నిబంధనలు తీసుకొచ్చింది. ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సెర్చ్ ర్యాంకింగ్స్, స్పాన్సర్డ్ లిస్టింగ్స్, డిస్కౌంట్ ధరలు, డార్క్ ప్యాటర్న్స్, విక్రేతల వివరాలపై పారదర్శకత పెరగనుంది. వినియోగదారులు కూడా కొనుగోలు ముందు సెల్లర్ వివరాలు, రిటర్న్ పాలసీ, చెల్లింపు పేజీ, స్పాన్సర్డ్ లేబుల్స్, ఇన్‌వాయిస్ వంటి అంశాలను పరిశీలించడం ద్వారా మోసాల నుంచి అప్రమత్తంగా ఉండొచ్చు.
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల హక్కుల రక్షణ, పారదర్శకతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘వినియోగదారుల రక్షణ నిబంధనలు-2026’ను విడుదల చేసింది. ఇవి 2027, జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ భద్రతనిస్తున్నా, కొనుగోలుదారులు మోసపోకుండా నిపుణులు సూచిస్తున్న 7 ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. కేవలం వస్తువు ఫోటోలు, ఆకర్షణీయమైన రివ్యూలు చూసి మోసపోవద్దు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి అమ్మకందారుడు తన వ్యాపార వివరాలు, చిరునామా, కస్టమర్ సర్వీస్ సమాచారం, రేటింగ్స్‌ను ప్లాట్‌ఫామ్‌పై తప్పక ప్రదర్శించాలి. ముఖ్యంగా ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు ఈ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. డబ్బులు చెల్లించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉన్న వెబ్‌సైట్ అడ్రస్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. అనుమానాస్పదంగా వేరే పేజీకి వెళ్తే వెంటనే వెనక్కి వచ్చేయాలి. మీ ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు. ఇక సెర్చ్‌లో పై వరుసలో కనిపించే ప్రతి వస్తువూ నాణ్యమైనదేనని గుడ్డిగా నమ్మకూడదు. కొన్ని ఉత్పత్తులు డబ్బులు చెల్లించడం ద్వారా సెర్చ్ ఫలితాల్లో పైన కనిపిస్తాయి. వీటిని తప్పనిసరిగా ‘స్పాన్సర్డ్’ లేదా ‘ప్రకటన’ అని స్పష్టంగా సూచించాలి. పై స్థానంలో ఉందని మాత్రమే ఆ ఉత్పత్తి నమ్మకమైనదని భావించవద్దు. అది కేవలం ఒక ప్రకటన అని గుర్తుంచుకోవాలి. తప్పుదోవ పట్టించే పాప్-అప్‌లు, అనవసర సబ్‌స్క్రిప్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని తికమకపెట్టి, అనవసరమైన కొనుగోళ్లకు లేదా సేవలకు సబ్‌స్క్రైబ్ చేయించే మోసపూరిత డిజైన్లను ‘డార్క్ ప్యాటర్న్స్’ అంటారు. కొత్త రూల్స్ ప్రకారం వీటిని నిషేధించారు. అనుకోని పాప్-అప్‌లు, సున్నితమైన సమాచారం అడిగే అభ్యర్థనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్డర్ ఇన్‌వాయిస్‌లు, మెయిల్స్ దాచుకోవాలి. సమస్య వస్తే 48 గంటల్లో ఫిర్యాదుల అధికారి స్పందించాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Paradise: ది ప్యారడైజ్’లో కయాదు పాత్రపై విమర్శలు..పెద్దిని చూసి కూడా ఓదెల ఇలా చేశారా?
SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
