బిగ్ అలర్ట్.. ఇకపై విమాన ప్రయాణంలో అది తీసుకెళ్లటం కుదరదు
విమానాల్లో పవర్ బ్యాంకుల భద్రతపై డీజీసీఏ కీలక చర్య తీసుకుంది. MOBIKINS MK-PB-04 మోడల్ పవర్ బ్యాంకును భారత్‌కు వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే, దేశీయ విమానాల్లో తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. ఇటీవల ఢిల్లీ–చెన్నై ఇండిగో విమానంలో ఎలక్ట్రానిక్ పరికరం నుంచి పొగ రావడంతో విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించిన ఘటన నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ప్రయాణికులు పవర్ బ్యాంకులను హ్యాండ్ బ్యాగేజీలో ఉంచి, విమాన సిబ్బంది సూచనలు పాటించాలి.
మీరు తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారా? ప్రయాణంలో ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్లే అలవాటు ఉందా? అయితే మీకు బిగ్ అలర్ట్! కేంద్ర పౌర విమానయాన సంస్థ- డీజీసీఏ (DGCA) అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.. విమానాల్లో పవర్ బ్యాంక్‌ల వాడకంపై కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా MK-PB-04 మోడల్ పవర్ బ్యాంక్‌లను ఫ్లైట్లలోకి తీసుకెళ్లడంపై పూర్తిగా నిషేధం విధించింది.. ఇటీవల విమానంలో పవర్ బ్యాంక్ పేలడంతో మంటలు చెలరేగడంతో.. ఆ వెంటనే ఫ్లైట్ ను శంషాబాద్ విమానాశ్రయానికి అత్యవసరంగా దారి మళ్లించారు. ఈ ఘటన నేపథ్యంలో తాజాగా.. పవర్ బ్యాంక్‌లపై ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏయే పవర్ బ్యాంక్‌లు వాడాలి? హ్యాండ్ బ్యాగేజ్‌లో ఎలా ఉంచుకోవాలి? ఈ కొత్త రూల్స్ ఏంటో ఈ రోజు వీడియోలో ఇన్-డెప్త్‌గా చూద్దాం! ముందుగా ఈ బ్యాటరీల నిషేధానికి దారితీసిన పరిస్థితులను చూస్తే.. ఇటీవల ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి. ఫ్లైట్ సిబ్బంది, ప్రయాణికులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. ఆ విమానాన్ని అత్యవసరంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించారు. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో విమానాల్లో పవర్ బ్యాంక్‌ల వినయోగంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అసలు పవర్ బ్యాంకులు ఎందుకు పేలుతాయి? పవర్ బ్యాంక్‌లలో లిథియం అయాన్, లిథియం పాలిమర్ బ్యాటరీలను వాడతారు. అధిక ఉష్ణోగ్రత లేదా వేడికి గురైనప్పుడు ఇవి మండే స్వభావాన్ని కలిగి ఉండి క్షణాల్లో పేలిపోతాయి! అందుకే భద్రత దృష్ట్యా MK-PB-04 మోడల్ పవర్ బ్యాంక్‌లతో పాటు నాణ్యత లేని పరికరాలపై డీజీసీఏ కఠిన ఆంక్షలు విధించింది. “డీజీసీఏ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు పాటించాల్సిన నియమాలు ఇవే: MK-PB-04 నిషేధం: ఈ నిర్దిష్ట మోడల్ పవర్ బ్యాంక్‌లను హ్యాండ్ బ్యాగేజ్, క్యాబిన్ బ్యాగ్స్ లేదా కార్గోలు… దేనిలోనూ అనుమతించరు. లగేజ్ చెకింగ్ నిబంధన: పవర్ బ్యాంక్‌లను చెక్-ఇన్ లగేజ్‌లో .. పెద్ద సూట్‌కేసుల్లో వేయకూడదు. కేవలం మీరు చేతితో తీసుకెళ్లే క్యాబిన్ బ్యాగ్‌లోనే ఉంచుకోవాలి. లిమిట్: కేవలం 100 Watt-hours (Wh) సామర్థ్యం కలిగిన గరిష్టంగా రెండు పవర్ బ్యాంక్‌లను మాత్రమే ప్రయాణికుడు తన వెంట తీసుకెళ్లవచ్చు. BIS రిజిస్ట్రేషన్: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆమోదం పొందిన ప్రామాణికమైన పవర్ బ్యాంక్‌లను మాత్రమే అనుమతిస్తారు. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? క్యాబిన్ బ్యాగుల్లో పవర్ బ్యాంక్ పెట్టి దానిని పైన ఉన్న ఓవర్‌హెడ్ బిన్ లో తోసేస్తారు! ఓవర్‌హెడ్ బిన్లలో పెట్టకూడదు: పవర్ బ్యాంక్ ఎప్పుడూ మీ చేతికందేలా, కంటికి కనిపించేలా ముందు సీట్ పాకెట్‌లో లేదా మీ చేతి సంచిలోనే ఉండాలి. మంటలు లేదా వేడి వస్తే: ప్రయాణంలో మీ పవర్ బ్యాంక్ విపరీతంగా వేడెక్కినా లేదా పొగ వస్తున్నట్లు గమనించినా… వెంటనే ఛార్జింగ్ ఆపేయాలి. దానిని అలాగే ఉంచి, వెంటనే విమానంలోని క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించాలి. వారు వెంటనే ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు.”సో ఫ్రెండ్స్… నెక్స్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కేముందు మీ పవర్ బ్యాంక్ మోడల్ ఏంటి? దాని కెపాసిటీ ఎంత ఉందో ఒకసారి సరిచూసుకోండి! ఈ ఇంపార్టెంట్ సేఫ్టీ అండ్ ఫ్లైట్ జర్నీ అప్‌డేట్‌ను మీ ఫ్రెండ్స్, తరచూ ప్రయాణాలు చేసే ఫ్యామిలీ మెంబర్స్‌కు వెంటనే షేర్ చేసి అప్రమత్తం చేయండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా! 70 ఏళ్ల పవిత్రబంధం ఇలా ముగిసింది
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇక మీకు ‘అన్ నోన్’ నంబర్ల నుంచి కాల్స్ ..!
OPPO F35 5Gలో ఇన్ని ఫీచర్లా? అదిరిపోయే బ్యాటరీతో దుమ్మురేపుతోంది!
