Axis Bank Diwali Offer: యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు బంపర్‌ ఆఫర్‌..! గృహ రుణాలపై 12 ఈఎంఐలు రద్దు.. (వీడియో)

దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ పలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన గృహ రుణ పథకాలపై 12 నెలవారీ వాయిదాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.


దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ పలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన గృహ రుణ పథకాలపై 12 నెలవారీ వాయిదాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ద్విచక్రవాహనాల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండానే ఆన్‌-రోడ్‌ ఖరీదు మొత్తాన్ని రుణంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా వ్యాపార సంస్థలకు టర్మ్‌ రుణాలతో పాటు వాణిజ్య పరికరాలు, వాహనాల కోనుగోలు కోసం ప్రత్యేక రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇక’ దిల్ సే ఓపెన్‌ సెలబ్రేషన్స్‌’ పేరిట యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ ద్వారా జరిగే కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్లు అందిస్తన్నట్లు తెలిపింది. 50 నగరాల్లో ఎంపిక చేసిన 2,500 దుకాణాల నుంచి కొనుగోళ్లు జరిపితే 20 శాతం దాకా రాయితీ అందిస్తున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ సుమిత్‌ బాలి వెల్లడించారు. కస్టమర్లు, యూజర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Click on your DTH Provider to Add TV9 Telugu