విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్! భారీగా తగ్గిన ఎయిర్‌పోర్ట్ ఫీజు
బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త యూడీఎఫ్ టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. దేశీయ ప్రయాణికుల ఫీజు రూ.550 నుంచి రూ.300కు, అంతర్జాతీయ ప్రయాణికుల ఫీజు రూ.1,500 నుంచి రూ.997కు తగ్గనుంది. అదే సమయంలో విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు తొలిసారిగా నామమాత్రపు ఫీజు విధించారు. రెండేళ్లలోపు పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్‌దారులు, విమాన సిబ్బందికి మినహాయింపు ఉంటుంది.
విమాన ప్రయాణికులకు ఇది శుభవార్త అని చెప్పాలి. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారికి ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌పోర్ట్ యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు అంటే యూడీఎఫ్‌ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త టారిఫ్ రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఐదేళ్ల కాలానికి కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ఏఈఆర్ఏ విడుదల చేసింది. విశేషమేమిటంటే, ఈసారి తొలిసారిగా విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులపై కూడా నామమాత్రపు ఫీజు విధించారు. తాజా సవరణ ప్రకారం, దేశీయ విమానాల్లో ప్రయాణించేవారు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.550 స్థానంలో ఇకపై కేవలం రూ.300 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే దాదాపు 45 శాతం మేర ఫీజు తగ్గింది. అదేవిధంగా, అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ ఫీజు రూ. 1,500 నుంచి రూ. 997కు తగ్గింది. ఇది సుమారు 34 శాతం తక్కువ. మరోవైపు, బెంగళూరుకు వచ్చే దేశీయ ప్రయాణికులు రూ.125, అంతర్జాతీయ ప్రయాణికులు రూ.426 చొప్పున కొత్తగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులతో బెంగళూరు నుంచి రానుపోను ప్రయాణించే దేశీయ ప్రయాణికుడు మొత్తం రూ.425 చెల్లిస్తారు. గతంలో ఇది కేవలం వెళ్లేటప్పుడే రూ.550గా ఉండేది. ఈ ఫీజును విమాన టికెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తారు. అయితే, రెండేళ్లలోపు పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, విధి నిర్వహణలో ఉన్న విమాన సిబ్బందికి ఈ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దేశీయ విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకే ఈ ఫీజులను తగ్గించినట్లు ఏఈఆర్ఏ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు 84 శాతం మంది దేశీయ ప్రయాణికులే ఉండటం దీనికి ప్రధాన కారణంగా చెప్పచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇస్రో సంచలన నిర్ణయం.. ఇకపై రాకెట్ల తయారీకి గుడ్ బై
Sugar Price: ఘాటెక్కిన చక్కెర.. పండగ వేళ సామాన్యులకు చుక్కలు
