క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!

Updated on: Apr 11, 2026 | 6:32 PM

క్రీమ్ బిస్కెట్ల పేరుతో 'Creme' బిస్కెట్లు మోసం చేస్తున్నాయి. నిజానికి, 'Creme' అంటే పాల క్రీమ్ కాదు; ఇది పామాయిల్, కొవ్వులు, చక్కెర, కృత్రిమ రంగుల మిశ్రమం. పోషకాలు లేని ఈ బిస్కెట్లు ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి, ముఖ్యంగా పిల్లలకు. కొనే ముందు పదార్థాల జాబితా (Ingredients list) తప్పక తనిఖీ చేయండి.

క్రీం బిస్కెట్లంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొందరు చిన్నారులు కేవలం క్రీమ్‌ మాత్రమే తిని బిస్కెట్‌ను పడేసేవారూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు అడగ్గానే బిస్కెట్లు కొనిస్తారు. పిల్లలకు ఇష్టమని మనం కొనిచ్చే క్రీమ్ బిస్కెట్లు నిజంగా పాలతో చేసినవేనా? అకర్షణీయమైన ప్యాకెట్ల వెనుక ఫుడ్ ఆరోగ్యకరమైనదేనా? అంటే.. చెప్పలేం. ఎందుకంటే.. ఇండస్ట్రీ ఆడుతున్న ఒక చిన్న స్పెల్లింగ్ గేమ్ తో వినియోగదారులు ఎంతగా మోసపోతున్నారో ఇప్పుడు బయటపడింది. మనం రోజూ కొనే క్రీమ్‌ బిస్కెట్ ప్యాకెట్ల మీద ఉండే ఒక చిన్న పదం వెనుక ఎంతటి భారీ మోసం దాగి ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నిజానికి ఫుడ్ నిబంధనల ప్రకారం, ‘Cream’ అని రాయాలంటే అది పాల నుంచి తీసిన మీగడ లేదా పాల కొవ్వుతో తయారై ఉండాలి. కానీ, మార్కెట్లో లభించే అత్యధిక శాతం బిస్కెట్ ప్యాకెట్ల మీద ‘Cream’ కు బదులుగా ‘Crème’ అని రాసి ఉంటుంది. వినడానికి రెండు ఒకేలా ఉన్నా.. ఈ చిన్న మార్పుతో కంపెనీలు చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకుంటూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నాయి. ‘Crème’ అని రాసి ఉన్న ప్యాకెట్లలో పాలతో చేసిన క్రీమ్ అణువంత కూడా ఉండదు. అది కేవలం పామాయిల్ మరియు వెజిటబుల్ ఫ్యాట్స్, విపరీతమైన చక్కెర, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు వీటన్నింటినీ కలిపి తయారు చేసిన ఒక రసాయన మిశ్రమం మాత్రమే. చూడటానికి, రుచికి క్రీమ్‌లా ఉన్నా.. ఇందులో పోషకాలు సున్నా, హండ్రెడ్‌ పర్సంట్‌ అనారోగ్యం. పాల క్రీమ్ వాడకుండా ప్యాకెట్‌పై ‘Cream’ అని రాస్తే ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం కేసులు నమోదవుతాయి. అందుకే కంపెనీలు తెలివిగా ‘Crème’ అనే ఫ్యాన్సీ పదాన్ని వాడుతున్నాయి. ఇది చదవడానికి స్టైలిష్‌గా ఉన్నా.. లోపల ఉన్నది మాత్రం కేవలం నూనెల మిశ్రమమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలీ క్రీమ్ బిస్కెట్లను తినడం వల్ల చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే పామాయిల్ ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్యాకెట్ ముందు ఉన్న ఆకర్షణీయమైన బొమ్మలను, పేర్లను చూసి మోసపోకండి. వెనుక తిప్పి చూడండి. ప్యాకెట్ వెనుక ఉండే ‘Ingredients List’ తప్పకుండా చదవండి. ఇంగ్రేడియంట్స్‌లో మొదటి వరుసలో Palm Oil, Vegetable Fat లేదా Sugar అని ఉంటే అది ఖచ్చితంగా నకిలీ క్రీమ్ బిస్కెటే అని గుర్తించండి. ఇకపై మీ పిల్లలకు బిస్కెట్లు కొనిచ్చే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. స్పెల్లింగ్ చూసి మోసపోకండి.. ఇంగ్రీడియంట్స్ చూసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా వెనక్కి తగ్గని మహిళా సిబ్బంది.. చివరకు

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

Follow Us