AP Municipal Elections: పార్టీ అభ్యర్థుల గుర్తులు తారుమారు..రెండుచోట్ల గందరగోళం

Updated on: Nov 01, 2026 | 10:52 AM

Andhra Pradesh Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో రెండుచోట్ల బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. విజయవాడ 55వ డివిజన్‌లో YSRCP, కాంగ్రెస్ గుర్తులు మారడంతో పోలింగ్ నిలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి 35వ వార్డులోనూ డిస్‌ప్లే పేపర్‌లో తప్పు దొర్లగా, అధికారులు ముందుగానే సరిదిద్దారు. విజయవాడలో YSRCP అనుమానాలు వ్యక్తం చేయగా, టీడీపీ కేవలం ప్రింటింగ్ తప్పు అని పేర్కొంది.

ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రెండు చోట్ల అభ్యర్థుల గుర్తులు తారుమారై గందరగోళం ఏర్పడింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్లపై YSRCP, కాంగ్రెస్ అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి YSRCP గుర్తు, YSRCP అభ్యర్థికి కాంగ్రెస్ గుర్తు వేయడంతో పోలింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.

అధికారులు వెంటనే కొత్త బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్నారు. ఎంత సమయం అయితే పోలింగ్ ఆగిందో, ఆ సమయాన్ని సాయంత్రం అదనంగా కేటాయిస్తామని అధికారులు తెలిపారు. అధికారుల తీరుపై YSRCP అనుమానాలు వ్యక్తం చేయగా, TDP మాత్రం ఇది కేవలం ప్రింటింగ్ లోపం అని, కావాలని చేసిన కుట్ర కాదని స్పష్టం చేసింది. ఎన్నికలు సజావుగా జరుగుతాయని TDP నాయకులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, తిరుపతి జిల్లా వెంకటగిరిలోని 35వ వార్డులోనూ ఇదే తరహా గుర్తుల తారుమారు జరిగింది. బూత్ బయట డిస్‌ప్లే పేపర్‌లో TDP అభ్యర్థి పేరు ముందు YSRCP గుర్తు వేశారు. అయితే, పోలింగ్ ప్రారంభం కావడానికి ముందే అధికారులు ఈ తప్పును గుర్తించి సరిదిద్దారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ యధావిధిగా కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us